Home /News /national /

CYCLONE TAUKTAE UPDATES 37 BODIES RECOVERED AND 36 STILL MISSING FROM P305 BARGE NEAR MUMBAI SK

Mumbai: మునిగిపోయిన ఆ నౌకలో 37 మృతదేహాలు లభ్యం.. మరో 36 మంది గల్లంతు

అరేబియా సముద్రంలో సహాయక చర్యలు

అరేబియా సముద్రంలో సహాయక చర్యలు

నౌక ప్రమాదం నేపథ్యంలో ఓఎన్జీసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మండిపడ్డారు.

    అరేబియా తీరాన్ని ముంచెత్తిన తౌక్టే తుపాను ముంబైలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తుపాను ధాటికి సముద్రంలో మునిగిపోయిన నౌకలో ఇంకా 36 మంది ఆచూకీ తెలియలేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు నాలుగు రోజులుగా గాలిస్తున్నాయి. సముద్రపు అలల ధాటికి పీ-305 బార్జ్ లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది. వెంటనే నేవి, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆఫ్‌షోర్ ఉద్యోగుల నివాసానికి ఉపయోగించే భారీ నౌకను బార్జ్ అంటారు. అందులో 261 మంది ఓఎన్జీసీకి సిబ్బంది ఉన్నారు. వారంతా నౌకలో ఉండగానే అది సముద్రంలో కొట్టుకుపోయి మునిగిపోయింది. రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 188 మంది సురక్షితంగా కాపాడారు. సముద్రంలో 37 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 36 మంది గల్లంతయ్యారు. వారి కోసం అరేబియా సముద్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ కొచ్చితో పాటు నేవి హెలికాప్టర్లతో సముద్రాన్ని గాలిస్తున్నారు.

    నౌక ప్రమాదం నేపథ్యంలో ఆయిల్ అండ్ నేచరుల్ గ్యాస్ కొర్పొరేషన్ (ONGC)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ''పశ్చిమ తీరానికి పెను తపాను ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చాలా రోజుల నుంచి హెచ్చరిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా తీరానికి తిరిగొచ్చారు. కానీ ఓఎన్జీసీ మాత్రం పట్టించుకోలేదు. బార్జ్‌ల్లో ఉన్న సిబ్బందిని ఎందుకు అక్కడి నుంచి తరలించలేదు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ఓఎన్జీసీదే. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి.'' అని ఆయన విమర్శించారు.

    తౌక్టే తుపాను ధాటికి సోమవారం సాయంత్రం పపా-305 (P-305) సహా మూడు బార్జ్‌లు, ఒక ఆయిల్ రిగ్ కొట్టుకపోయాయి. గాల్‌ కన్స్‌ట్రక్టర్‌కు చెందిన బార్జ్‌ సముద్రంలోకి కొట్టుకుపోగా.. అందులో ఉన్న 137 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ టీమ్స్ కాపాడాయి. 196 మంది సిబ్బంది ఉన్న ఎస్ఎస్-3, 101 సిబ్బందితో పాటు ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిగ్ సాగర్ భూషణ్ కూడా కొట్టుకుపోయాయి. ఐతే వెంటనే కోస్ట్ గార్డ్, నేవీ దళాలు రంగంలోకి దిగి.. సిబ్బందిని కాపాడాయి. వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. కానీ పీ-305 ముంబై తీరం నుంచి కొట్టుకుపోవడంతో ఘోర ప్రమాదం సంభవించింది.

    ముంబై తీరంలో బార్జ్‌లు కొట్టుకుపోయిన ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ కూడా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ కూడా రంగంలోకి దిగింది. ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు ఉన్నతస్ధాయిని కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Arabian Sea, Mumbai, Taukte Cyclone, Taukte cyclone effect trains

    తదుపరి వార్తలు