• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CYCLONE TAUKTAE INTENSIFIES IN KERALA CYCLONE HOUSE COLLAPSES IN KASARAGOD SU

Cyclone Tauktae: తౌక్తా తుపాన్.. ఇలా చూస్తుండగానే అలా కూలిపోయిన బిల్డింగ్.. వీడియో

Cyclone Tauktae: తౌక్తా తుపాన్.. ఇలా చూస్తుండగానే అలా కూలిపోయిన బిల్డింగ్.. వీడియో

సముద్రంలో కూలిపోతున్న బిల్డింగ్

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్తా తుపాన్‌గా మారింది. ఈ తుపాన్ ప్రభావం కేరళపై భారీగానే ఉంది.

  • Share this:
    అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్తా తుపాన్‌గా మారింది. గోవాకు దక్షిణనైరుతి దిశగా 330 కి.మీ. దూరంలో తౌక్తా కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది రాగల 6 గంటల్లో తీవ్ర, 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఈ తుపాన్ ప్రభావం కేరళపై భారీగానే ఉంది. ఇప్పటికే కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్, మలప్పురమ్, కోజికొడే, వయనాడ్, కానూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్రం ఎగసిపడుతుంది. దీంతో తీర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

    పలు ప్రాంతాల్లో బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ స్థంభాలు నెలకొరిగాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరింత బలమైన గాలుల వీచే అవకాశం ఉండటం, వర్షాలు కూడా పడుతుండగంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం పినరాయి విజయన్ కోరారు. కేరళలోని కసర్‌గడ్‌ జిల్లాలో తుపాన్‌ ప్రభావంతో తీర ప్రాంతంలో ఉన్న రెండొతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఆ భవనం సముద్రపు జలాల్లో కలిసిపోయింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ భవనంలో ఎవరూ లేనట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



    భారీ వర్షాల కారణంగా ఇడుక్కి జిల్లాలో మూడు ఆనకట్టల గేట్లను తెరిచారు. మలంకర, కల్లార్కుట్టి, పంబాలా ఆనకట్టల గెట్లు తెరిచి.. నియంత్రిత పద్ధతిలో నీటిని బయటకు వదులుతున్నారు. ఆనకట్టలు తెరవడం వల్ల నదులలో నీటి మట్టంపెరిగింది. ఈ క్రమంలోనే పెరియార్‌ నదికి ఇరువైపులా ఉన్న ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు