• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CYCLONE NIVAR TAMIL NADU PUDUCHERRY BRACE AS CYCLONE NIVAR NEARS NK

Cyclone Nivar: నేడు తీరం దాటనున్న తీవ్ర తుఫాను నివర్. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు అలర్ట్

Cyclone Nivar: నేడు తీరం దాటనున్న తీవ్ర తుఫాను నివర్. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు అలర్ట్

Cyclone Nivar: నేడు తీరం దాటనున్న తీవ్ర తుఫాను నివర్. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు అలర్ట్

Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో నివార్ తుఫాను ప్రళయ భీకరంగా ఉంది. ఇప్పటికే తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

  • Share this:
    Cyclone Nivar: బంగాళాఖాతంలో నివర్ తీవ్ర తుఫాను... ఇవాళ అతి తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం అది కడలూర్‌కి తూర్పు ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రాత్రికి తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరందాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నట్లు వివరించారు.

    తెలంగాణపై తుఫాను ప్రభావం అంతగా లేకపోయినా... ప్రభుత్వం ఎందుకైనా మంచిదని అప్రమత్తం అయ్యింది.

    ఏపీలో తుఫాను సహాయక చర్యలకోసం ఎస్టీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 22 NDRF బృందాలు రంగంలోకి దిగాయి. వీటిలో 12 తమిళనాడులో, 7 ఏపీలో ఉన్నాయి. 3 బృందాలు పుదుచ్చేరిలో ఉన్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే... మరో 8 బృందాలు కూడా రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాయి.


    తుఫాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అలాగే... రైతలు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలనీ... ధాన్యం, పంటలు తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


    తమిళనాడులో సెలవు:
    నివర్ తుఫాను దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం రెండ్రోజులుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో... ఇవాళ సెలవు ప్రకటించింది పళనిస్వామి ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    భారత వాతావరణ విభాగం (IMD), తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు (TNSDMA)... ఈ తుఫానుకి సంబంధించి ఎప్పటికప్పుడు వెదర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయో అక్కడి ప్రజలకు అప్రమత్త సందేశం ఇస్తున్నారు.

    November 25:
    నేడు తమిళనాడులోని డెల్టా జిల్లాలు, కడలూర్, కల్లకూర్చీ, పుదుచ్చేరి, విల్లుపురం, తిరువణ్ణమలై, చెంగలపట్టు, అరియాలూర్, పెరంబలూర్, కరైకల్‌లో అతి భారీ వర్షాలు కురిసేలా ఉన్నాయి.



    ఇది కూడా చదవండి: Annual Darkness: ఆ టౌన్‌లో 2 నెలలపాటూ కనిపించని సూర్యుడు... ఎందుకు?

    November 26:
    నవంబర్ 26న ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూర్, వెళ్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు