Home /News /national /

Cyclone Nivar: తుఫాన్‌లకు పేర్లు ఎవరు పెడతారు? రాబోయే తుఫాన్‌ల లిస్ట్ ఇదే

Cyclone Nivar: తుఫాన్‌లకు పేర్లు ఎవరు పెడతారు? రాబోయే తుఫాన్‌ల లిస్ట్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyclone Nivar: బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ, భారత్ సూచించిన గతి తుఫాన్‌లు ఇప్పటికే వచ్చి వెళ్లాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న నివర్ తుఫాన్ పేరును ఇరాన్ సూచించింది.

    బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ నివర్.. తూర్పు తీరం వైపు దూసుకొస్తోంది. తమిళనాడు తీరంతో పాటు ఏపీ, కర్నాటకలోని పలు జిల్లాలను ముంచెత్తేందుకు వేగంగా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతున్న నివర్.. మరికొన్ని గంటల్లో పెను తుఫాన్‌గా బలపడనుంది. ప్రస్తుతం నివర్ తుఫాన్ గంటకు 11 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది. ఇవాళ అర్ధరాత్రి పుదుచ్చేరి సమీపంలోని కరైకల్, మామల్లపురం మధ్య తీరం దాటే అవకాశముంది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు భీకరమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 120 నుంచి 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరించింది. హుద్ హుద్, తిత్లీ, గజ, పెథాయ్, అమ్‌ఫున్, నిసర్గ, గతి, నివర్..తుఫాన్‌లకు ఈ పేర్లకు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు తుఫాన్‌లకు పేర్లు ఎందుకు పెడతారు?

    అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్ల వచ్చే తుఫాన్‌లకు 1953 నుంచే పేర్లు పెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ పని చేస్తుంది. కానీ దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్‌లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకు ముందు హిందూ. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. అవన్నీ అనామకంగానే మిగిలిపోయాయి.

    Cyclone Nivar: దూసుకొస్తున్న తుఫాన్.. నివర్ గమనాన్ని లైవ్‌లో వీక్షించండి..

    ఐతే తుఫాన్‌లకు పేర్ల పెట్టకపోవడం వల్లే వాటి గురించి వార్తల్లో రాయాలన్నా, చర్చించాలన్నా ఇబ్బందికర పరిస్థితుల తలెత్తుతాయి. పలానా సంవత్సరం అని చెప్పినా అందులో స్పష్టత ఉండదు. ఇక ఒకే సంవత్సరంలో రెండు మూడు తుఫాన్‌లు వస్తే మరింత గందరగోళం ఉంటుంది. తుఫాన్‌ల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే తుఫాన్‌లకు పేర్ల పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి. 2004లో WMO (World Meteorological Organization) ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు. ఆ తర్వాత 64 తుఫాన్‌లు రావడంతో ఆ జాబితాలోని పేర్లన్నీ పూర్తయ్యాయి.

    ఈ నేపథ్యంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో WMO కొత్త జాబితాను విడుదల చేసింది . ఈసారి 13 దేశాలు 13 పేర్ల చొప్పున సూచించడంతో.. మొత్తం 169 పేర్లు వచ్చాయి. ఈ జాబితాలో ఇప్పటికే రెండు పేర్లను వాడారు. బంగ్లాదేశ్ సూచించిన నిసర్గ, భారత్ సూచించిన గతి తుఫాన్‌లు ఇప్పటికే వచ్చి వెళ్లాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న నివర్ తుఫాన్ పేరును ఇరాన్ సూచించింది.

    తుఫాన్ల పేర్ల వివరాలు:


    భారత్ సూచించిన తుఫాన్‌ల పేర్లు:
    గతి, తేజ్, మురసు, ఆగ్, వ్యామ్, ఝర్, ప్రొబాహొ, నీర్, ప్రభంజన్, ఘుర్ని, అంబుద్, జలధి, వేగ.

    కాగా, ఏపీని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫాన్‌కు..ఆ పేరును పాకిస్తాన్ పెట్టింది. తిత్లీకి సైతం పాకిస్తానే నామకరణం చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Cyclone Nivar, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు