Cyclone Nivar: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారి... రెండ్రోజుల్లో తుఫానుగా మారబోతోంది. దీనివల్ల తమిళనాడుకు నవంబర్ 25 నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. ఈ తుఫానుకు నివార్ అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతోంది. అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందనీ... ఆ తర్వాత మరో 24 గంటల్లో తుఫానుగా అవుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం దగ్గర నవంబర్ 25న మధ్యాహ్నం వేళ తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. నవంబర్ 25 నుంచి తమిళనాడులోని చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.
తుఫానును దృష్టిలో పెట్టుకొని... తమిళనాడు, పుదుచ్చేరికి సైక్లోన్ అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 22 నుంచి జాలర్లు... చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా నవంబర్ 22 నుంచి 25 వరకూ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లో బంగాళాఖాతంలోకి వెళ్లొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో జాలర్లు కూడా చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు.
తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం:
ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల పైనా పడనుంది. నవంబర్ 25, 26 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంట, రాయలసీమలో, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం, అధికారులు... తుఫాను ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను రెండు మార్గాల్లో వెళ్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెబుతుండటంతో... అది ఎటు వెళ్తే... ఏయే ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందో, అక్కడ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
భారత వాతావరణ విభాగం (IMD), తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు (TNSDMA)... ఈ తుఫానుకి సంబంధించి ఎప్పటికప్పుడు వెదర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయో అక్కడి ప్రజలకు అప్రమత్త సందేశం ఇస్తున్నారు.
November 23:
నవంబర్ 23న అంటే నేడు... తంజావూర్, తిరువారూర్, నాగపట్టినం, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది.
November 24:
నవంబర్ 24 అంటే మంగళవారం... పుదుకొట్టాయ్, తంజావూర్, తిరువారూర్, కరైకల్, నాగపట్టినం, కడలూరు, అరియాలూర్, పెరంబాలూ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చనే అంచనా ఉంది.
November 25:
నవంబర్ 25న బుధవారం డెల్టా జిల్లాలు, కడలూర్, కల్లకూర్చీ, పుదుచ్చేరి, విల్లుపురం, తిరువణ్ణమలై, చెంగలపట్టు, అరియాలూర్, పెరంబలూర్, కరైకల్ లో అతి భారీ వర్షాలు కురిసేలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Cat Language App: పిల్లి భాషకు ట్రాన్స్‌లేషన్ యాప్... మ్యావ్ మీనింగ్ ఏంటంటే...
November 26:
నవంబర్ 26న ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూర్, వెళ్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.