Cyclone Nisarga: ముంబైలో144 సెక్షన్.. సీఎంకు ప్రధాని ఫోన్

నిసర్గ తుఫాన్ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కే పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నారు.

news18-telugu
Updated: June 2, 2020, 7:52 PM IST
Cyclone Nisarga: ముంబైలో144 సెక్షన్.. సీఎంకు ప్రధాని ఫోన్
నిసర్గ తుఫాన్
  • Share this:
పశ్చిమ తీరంలో సైక్లోన్ నిసర్గ కల్లోలం రేపుతోంది. ముంబైని ముంచెత్తేందుకు దూసుకొస్తోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముంబైపై నిసర్గ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో.. నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ముంబైలోని బీచ్‌లు, ఇతర తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.

నిసర్గ తుఫాన్ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కే పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు.

First published: June 2, 2020, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading