Cyclone Nisarga: తప్పిన తుఫాన్ ముప్పు.. ఊపిరిపీల్చుకున్న ముంబై

దక్షిణ అలీబాగ్‌ ప్రాంతంలో నిసర్గ తుపాను తీరం దాటడం వల్లే ముంబయికి ముప్పు తప్పిందని IMD వెల్లడించింది. ఆ పట్టణానికి 100 కి.మీ.దూరంలో ముంబైకి ముప్పు తప్పింది.

news18-telugu
Updated: June 3, 2020, 10:20 PM IST
Cyclone Nisarga: తప్పిన తుఫాన్ ముప్పు.. ఊపిరిపీల్చుకున్న ముంబై
మహారాష్ట్రలో కూలిన చెట్లు
  • Share this:
3 రోజులుగా ముంబైని భయపెట్టిన సైక్లోన్ నిసర్గ.. ఆ మహానగరంపై అంతగా ప్రభావం చూపలేదు. ఊహించినంత విధ్వంసం లేకపోవడంతో ముంబై ఊపిరిపీల్చుకుంది. దక్షిణ అలీబాగ్‌ ప్రాంతంలో నిసర్గ తుపాను తీరం దాటడం వల్లే ముంబయికి ముప్పు తప్పిందని IMD వెల్లడించింది. ఆ పట్టణానికి 100 కి.మీ.దూరంలో ముంబైకి ముప్పు తప్పింది. అలీ బాగ్‌లో బుధవారం మధ్యాహ్నం తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సాయంత్రానికి తుఫాన్ బలహీనపడడంతో.. వర్షం, ఈదురు గాలులు కూడా తగ్గుముఖం పట్టాయి.

తుఫాన్ ప్రభావంతో రాయ్‌గఢ్ జిల్లా భారీ వర్షాపాతం నమోదయింది. చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అలలీబాగ్ ప్రాంతంలో స్తంభం కూలి ఓ వృద్ధుడు చనిపోయాడు. తుఫాన్ ధాటికి మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. అటు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముంబైలో 7, రాయగఢ్‌లో 7, పాల్‌గఢ్‌లో 2, రత్నగిరిలో 2, థానె, సింధుదుర్గ్‌లో ఒక్కో బృందం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ముంబై మాత్రమే కాదు.. గుజరాత్‌కు తుఫాన్ ముప్పు తప్పింది. కేవలం మోసర్తు వర్షాలు మాత్రమే కురవడంతో గుజరాతీలు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

First published: June 3, 2020, 10:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading