Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్‌ తుపాను.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు..

గులాబ్ తుపాన్

ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

 • Share this:
  Cyclone Gulab update: బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారిన సంగతి తెలిసిందే. అది మరింత బలపడి శనివారం సాయంత్రానికి తుపాన్‌గా మారింది. దీనికి గులాబ్‌గా(Cyclone Gulab) నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాలపూర్‌కు(Gopalpur) 310 కి.మీ, శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నానికి(Kalingapatnam) 380 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. తుపాన్ ఆదివారం సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (India Meteorological Department) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది.

  తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతోనూ(wind speed).. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆది, సోమ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

  Heavy Rains: కుండపోతతో తడిసి ముద్దైన భాగ్యనగరం.. బయటకు ఎవరూ రావొద్దంటూ హెచ్చరిక

  తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధికారులు ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అత్యవసర సాయం అందించేందుకు బృందాలను కూడా సిద్దం చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్‌ను పంపారు. తుపాన్ నేపథ్యంలో కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్డుకు అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు.

  Andhra Pradesh: ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న కోడలు.. వారిద్దరు కలిసి ఉండగా చూసిన మామ.. కట్ చేస్తే..

  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
  ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు( heavy rainfall) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తలు శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 - 95 కీమీ వేగంతో బలమైన ఈదురగాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

  ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు..
  ఇప్పటికే ఒడిశా, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంట్లలో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
  Published by:Sumanth Kanukula
  First published: