• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • CYCLONE FANI LIVE UPDATES STORM FANI WILL NOW WEAKEN AND CONTINUE TO WEAKEN TILL SATURDAY EVENING NK

Cyclone Fani : రేపు సాయంత్రం వరకూ ఫొణి తుఫాను ప్రభావం... నాగాలాండ్, మణిపూర్‌కీ పొంచివున్న ముప్పు...

ఫణి తుఫాన్ ప్రభావం

Cyclone Fani Live Updates : మూడు గంటల కిందట తీరాన్ని తాగిన ఫొణి తుఫాను... క్రమంగా బలహీన పడి... శనివారం సాయంత్రం వరకూ ప్రభావం చూపనుంది.

  • Share this:
ఒడిషాలో పుణ్యక్షేత్రం పూరీలో తీరాన్ని తాకి... పూర్తిగా భూమిపైకి వెళ్లిన ఫొణి తుఫాను... మూడు గంటలుగా తీవ్ర ప్రభావం చూపింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. మధ్యాహ్నం నుంచీ బలహీన పడనున్న తుఫాను... శనివారం సాయంత్రానికి పూర్తిగా బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. భువనేశ్వర్ నుంచీ తుఫాను దిశ మార్చుకొని... తిరిగి సముద్రంలోకి వెళ్లి... బెంగాల్‌లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో బెంగాల్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మణిపూర్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తాజాగా అంచనా వేశారు. ప్రస్తుతం భువనేశ్వర్‌పై ప్రభావం చూపిస్తున్న తుఫాను... అక్కడ భారీ వర్షాలు కురిసేలా చేస్తోంది.

ప్రస్తుతం ఫొణి తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర మొదలు... బంగ్లాదేశ్ వరకూ... భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐతే... ఈశాన్య భారతంలో మాత్రం చిరు చినుకులు పడుతున్నాయి. ఒడిశాపై మాత్రం తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పూరీ, భువనేశ్వర్‌లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో తలమునకలయ్యాయి.

తుఫాను బాధితులకు అధికారులు షెల్టర్ హోంలలో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఐతే... తమకు సరైన సదుపాయాలు అందట్లేదని బాధితులు చెబుతున్నారు. ఎక్కువ మంది బాధితులు ఉండటంతో అందరికీ అన్ని సదుపాయాలూ అందించటం సవాలవుతోందని అధికారులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

Cyclone Fani : పూరీపై విరుచుకుపడిన ఫొణి తుఫాను... సహాయక చర్యల్లో NDRF...


సీసీ కెమెరాను కొట్టేసి... మరో సీసీ కెమెరాకు దొరికిన దొంగ...

తమిళనాడులో వింత దూడ... మనిషిలా ప్రవర్తిస్తూ... ఆందర్నీ ఆశ్చర్యపరుస్తూ...

Cyclone Fani : ఒడిశాపై విరుచుకుపడిన ఫొణి తుఫాను... 50,000 గ్రామాలు... 50 నగరాలకు ముప్పు...
First published: