Cyclone Fani Live Updates: ఏపీలోని 733 గ్రామాలపై ఫణి ఎఫెక్ట్, రూ.10కోట్ల నష్టం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు ఫణి నుంచి పెను ముప్పు తప్పింది. ఒడిశాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటికే ఆరోగురు చనిపోయారు.

 • News18 Telugu
 • | May 03, 2019, 16:34 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED 2 YEARS AGO

  AUTO-REFRESH

  Highlights

  6:25 (IST)

  ఫణి (ఫొణి) తుఫాను ఎలా వెళ్తోందో లైవ్ లో చూడండి.
   

  19:17 (IST)

  ఫణి తుఫాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వేలో రద్దయిన రైళ్ల వివరాలు..

  ఫణి తుఫాన్ తీరాన్ని దాటినా.. ఆ ప్రభావం ఇంకా కొనసాగనుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ ముందు జాగ్రత్తగా కొన్ని రైళ్లను రద్దు చేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది.

  4వ తేదీన రద్దయిన రైళ్ల వివరాలు..
  భువనేశ్వర్ - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్
  మంగళూరు - సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
  సికింద్రాబాద్ - హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
  తిరుపతి - పూరీ ఎక్స్‌ప్రెస్

  5వ తేదీన రద్దయిన రైళ్ల వివరాలు..
  డిబ్రూగఢ్ - తాంబరం ఎక్స్‌ప్రెస్

  6వ తేదీన రద్దయిన రైళ్ల వివరాలు..
  ముజఫర్‌పూర్ - యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్

  రైల్వే ట్రాక్ డబ్లింగ్ వల్ల కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
  మిర్జాపల్లి  - కాచిగూడ పాసింజర్ రైలు (మే 3 నుంచి మే 9 వరకు)
  మహబూబ్ నగర్ - మిర్జాపల్లి పాసింజర్ (కాచిగూడ నుంచి మిర్జాపల్లి వరకు రద్దు. మే 9 వరకు)

  19:10 (IST)

  ఒడిశాలోతుఫాన్ బీభత్సానికి కూలిన చెట్లు


  16:55 (IST)

  గతంలో తుఫాన్ వచ్చిదంటే బాధితులకు న్యాయం చేయాలని ధర్నాలు చేసేవాళ్లు. ఇప్పుడు ప్రతిపక్షాలు విదేశాలు వెళ్లే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం రియల్ టైమ్‌లో సమీక్షిస్తూ బాధితులకు సాయం చేసింది. ఇదంతా ఒక్కరోజులో కాదు. ఐదేళ్ల శ్రమ.
  - చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం

  16:47 (IST)

  ‘తుఫాన్ మీద సమీక్షకు కూడా ఎన్నికల కమిషన్ అడ్డం పడింది. తుఫాన్ వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇచ్చింది. మరోవైపు మోదీ మాత్రం రివ్యూ చేసుకుంటున్నారు. సాధారణ పరిపాలనలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎన్నికల కోడ్ సడలించాలని లేఖ రాసినా కూడా సమయానికి స్పందించలేదు. ప్రధాని మోదీకి ఎవరు అనుమతి ఇచ్చారో తెలీదు. కేబినెట్ మీటింగ్‌లు పెట్టారు. సమీక్షలు పెట్టారు. ఎన్నికల కమిషన్ పరిణతితో వ్యవహరించాలి. హద్దులు అర్ధం చేసుకోవాలి. రాజ్యాంగం ఈసీకి అధికారాలిచ్చింది. మాకూ అధికారాలిచ్చింది. మా ఇష్ట ప్రకారం మాట్లాడతామని ఈసీ అనడం సరికాదు.’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

  16:33 (IST)

  ఫణి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షా 14వేల 500 మందికి ఆహారాన్ని అందిచినట్టు చంద్రబాబు తెలిపారు. రేపటి వరకు వారికి ఆహారాన్ని అందిస్తామన్నారు. ఫణి తుఫాన్ వల్ల ఎక్కడెక్కడ సమస్య ఏర్పడిందో దాన్ని తెలుపుతూ ప్రజలు ఫొటోలు పంపుతున్నారని, వాటిని పరిశీలించి, వెంటనే సహాయకచర్యలు చేపట్టామని చెప్పారు.

  16:31 (IST)

  ఫణి తుఫాన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ లైవ్..
   

  16:26 (IST)

  ఫణి తుఫాన్ వల్ల ఏపీలో రూ.10కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. టెలికం, విద్యుత్, సమాచార వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్ధరించామని చెప్పారు.

  ఆంధ్రప్రదేశ్‌లోని 14 మండలాలు, 733 గ్రామాల్లో ఫణి తుఫాన్ ప్రభావం చూపిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో సుమారు రూ.10కోట్ల నష్టం వచ్చినట్టు అంచనా వేశామన్నారు. ఇప్పటికే 9 మండలాల్లో సహాయకచర్యలు పూర్తయ్యాయని, మిగిలిన 5 మండలాల్లో సహాయకచర్యలు పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఫణి తుఫాన్ గమనాన్ని ఆర్టీజీఎస్ కచ్చితంగా అంచనా వేశామని చెప్పారు. ఒడిశాలో ఫణి తుఫాన్ ప్రభావంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలు మొత్తం నీట మునిగాయి. పూరీ ప్రాంతంల్లో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. చెట్లు కూలిపోయాయి. గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో రాకాశి గాలులు వీస్తున్నాయి. అది గంటలకు 200 కిలోమీటర్లకు కూడా పెరగవచ్చిన ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రభావంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. టెలికం వ్యవస్థ దెబ్బతింది. 1999 తర్వాత ఈ స్ధాయిలో ప్రచంఢ తుఫాన్ విరుచుపడడం ఇదే. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాన్ ఒడిశా తర్వాత బెంగాల్‌ను టచ్ చేసి.. బంగ్లాదేశ్ దిశగా వెళ్తుందని అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల వరకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి అధికారులు సూచనల తర్వాత విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తారు.

  ఆంధ్రప్రదేశ్‌కు ఫణి నుంచి పెను ముప్పు తప్పింది. ఒడిశాలో తీవ్ర ప్రభావం ఉంది. ఇప్పటికే ఆరోగురు చనిపోయారు. 12లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ ముమ్మర సహాయకచర్యలు చేపడుతోంది. కోస్ట్ గార్డ్ కూడా తుఫాన్ సేవల్లో పాల్గొంటోంది. సహాయక సామగ్రిని తరలిస్తోంది.

  ఒడిషాలో పుణ్యక్షేత్రం పూరీలో తీరాన్ని తాకి... పూర్తిగా భూమిపైకి వెళ్లిన ఫొణి తుఫాను... మూడు గంటలుగా తీవ్ర ప్రభావం చూపింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. మధ్యాహ్నం నుంచీ బలహీన పడనున్న తుఫాను... శనివారం సాయంత్రానికి పూర్తిగా బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. భువనేశ్వర్ నుంచీ తుఫాను దిశ మార్చుకొని... తిరిగి సముద్రంలోకి వెళ్లి... బెంగాల్‌లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో బెంగాల్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే మణిపూర్, నాగాలాండ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తాజాగా అంచనా వేశారు.