CYCLONE ASANI DEPRESSION TO INTENSIFY INTO CYCLONIC STORM TODAY IMD WARNS HEAVY RAINS IN ANDAMANS MKS
Cyclone Asani: వాయువేగంతో అసానీ తుపాను.. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అండమాన్ దీవులకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
అసానీ తుపాను వాయివేగంతో దూసుకొస్తున్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం(మార్చి 21న) తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
ఎండాకాలంలో వాతావరణాన్ని చల్లబరిచేదే అయినా, విపత్తు కోణంలో అలజడి రేకెత్తిస్తోన్న అసానీ తుపాను వాయివేగంతో దూసుకొస్తున్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం(మార్చి 21న) తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అసానీ తుపాను ధాటికి అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అక్కడ శనివారం నుంచి వర్షాలు పడుతూనేనే ఉన్నాయి..
అల్పపీడనం తుపానుగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని, తీర ప్రాంతాల్లో గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి తెలిపింది. దీని ప్రభావం అండమాన్, నికోబార్ దీవులతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్లపై అధికంగా ఉంటుందని పేర్కొంది. తుపాను ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లపై అసానీ తుపాను ప్రభావం ఉండొచ్చనే అంచనాలున్నాయి.
అసానీ తుపాను ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు మార్చి 22 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది.
అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ తుపాను దృష్ట్యా మార్చి 22 వరకు - నాలుగు రోజుల పాటు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు. స్థానిక యంత్రాంగానికి తోడు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు కూడా సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే పలు లోతట్టుప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.