Home /News /national /

CYBERCRIMINALS WHO COMMIT FRAUD WITH FAKE MESSAGES IN CORONAVIRUS EFFECT BN

ఈ లింక్ క్లిక్ చేశారో.. మీ అకౌంట్లలో రూ.15 వేలు.. ఇది పక్కా ఫేక్ న్యూస్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 జమ చేస్తున్నాడన్న మెసేజ్‌ను సృష్టించారు.

    ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు తమ చేష్టలతో ప్రజలకు ఊపిరాడనివ్వడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో నకిలీ వార్తలను సృష్టిస్తున్నారు. వాటి ఆధారంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఏవి నకిలీ వార్తలో.. ఏవీ నిజాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 జమ చేస్తున్నాడన్న మెసేజ్‌ను సృష్టించారు. విపరీతమైన సోషల్ మీడియా వాడకం పెరిగిన నేపథ్యంలో కొద్దిసమయంలో ఆ మెసేజ్ వైరల్‌గా మారింది. ఆ మెసెజ్‌లో ఓ లింకును పేర్కొని.. దాన్ని క్లిక్ చేసి వివరాలు నింపితే.. మీ బ్యాంకు ఖాతాలో రూ.15వేలు పడతాయని సూచించారు. అయితే వాస్తవానికి ఇది నకిలీ సమాచారంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పేర్కొంది. అందులో సూచించిన లింక్‌పై క్లిక్ చేస్తే మోసానికి గురవుతారని తెలిపింది. ఇటువంటి నకిలీ మెసేజ్‌‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Bank account, Corona, Coronavirus, Prime minister

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు