కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎవరు..? ఎంపిక కోసం 5 గ్రూప్‌లను ఏర్పాటుచేసిన సీడబ్ల్యూసీ

125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాలంటే... దానికి నాయకత్వం వహించే నేత ఎంత సమర్థుడై ఉండాలి. అందుకే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా... లోతైన సంప్రదింపులు జరిపేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ... ప్రత్యేక గ్రూప్‌లను నియమించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 1:30 PM IST
కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎవరు..? ఎంపిక కోసం 5 గ్రూప్‌లను ఏర్పాటుచేసిన సీడబ్ల్యూసీ
ప్రతీకాత్మక చిత్రం (Image : AICC)
  • Share this:
జాతీయ కాంగ్రెస్‌కి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగివుంటే... పరిస్థితులు మరోలా ఉండేవి. కానీ ఆయన రాజీనామా చేసి తప్పుకోవడంతో... ఆ పార్టీని నడిపించే సారధి ఎవరన్న అంశం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎవర్ని బడితే వాళ్లను వెంటనే నియమించేయకుండా... కాంగ్రెస్ హైకమాండ్, కోర్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్నీ కూడా కలిసి... ఓ నిర్ణయానికి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఐదు గ్రూపులను ఏర్పాటు చేశాయి. ఈ గ్రూపులకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అహ్మద్ పటేల్ నాయకత్వం వహించబోతున్నారు. వీళ్లు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, నాయకులు, పీసీసీ అధ్యక్షులు అందరితోనూ సంప్రదింపులు జరిపి... అత్యున్నత పదవికి ఎవర్ని ఎంపిక చెయ్యాలో అభిప్రాయాలు తెలుసుకుంటారు.

తూర్పు ప్రాంతానికి సోనియాగాంధీ, దక్షిణాదికి మన్మోహన్ సింగ్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అలాగే పశ్చిమానికి రాహుల్, ఉత్తరానికి ప్రియాంక దృష్టి పెట్టనున్నారు. ఈశాన్య భారత్ పై అహ్మద్ పటేల్ దృష్టి ఉంటుంది. ఐతే... ఈ గ్రూపులకు నేతలుగా తమ పేర్లు (సోనియా, రాహుల్) ఎంపిక చెయ్యడం తనకు నచ్చలేదన్నారు సోనియా గాంధీ.

ఇప్పటికే కాంగ్రెస్ అధినేతగా ఎవరు అన్నదానిపై తెరపైకి చాలా పేర్లు వచ్చాయి. యంగ్ నేత ఉండాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. కాంగ్రెస్ ముంబై నేత మిలింద్ దేవరా అయితే... జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్‌ల పేర్లు తెరపకి తెచ్చారు. కొంతమంది శశి థరూర్ పేరును ప్రస్తావిస్తున్నారు. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే పేర్లు కూడా వినిపించాయి. చివరకు ఎవర్నీ ఎంపిక చెయ్యలేదు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఎన్నికల్లో ఓటమితో... మే 25న రాహుల్ గాంధీ... పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు