• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CUTTACK DISTRICT COLLECTOR CHAYANI ISSUES NO VACCINE NO SALARY WARNING TO THE HEALTH WORKERS SSR

No Vaccine-No Salary: కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే జీతాలివ్వమంటూ కలెక్టర్ హెచ్చరిక

No Vaccine-No Salary: కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే జీతాలివ్వమంటూ కలెక్టర్ హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి దాకా దాదాపు 50 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. కోవిడ్-19 వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలు, సందేహాలు ఇంకా పూర్తి స్థాయిలో సమసిపోలేదు. వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇప్పటికీ కొందరు హెల్త్ వర్కర్లు ముందుకు రావడం లేదు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లలో దుష్ప్రభావాలు కనిపించడమే ఈ భయానికి కారణంగా...

  • Share this:
    ఒడిశా: భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి దాకా దాదాపు 50 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. కోవిడ్-19 వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలు, సందేహాలు ఇంకా పూర్తి స్థాయిలో సమసిపోలేదు. వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇప్పటికీ కొందరు హెల్త్ వర్కర్లు ముందుకు రావడం లేదు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లలో దుష్ప్రభావాలు కనిపించడమే ఈ భయానికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని కటక్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన తాజా ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రిజిస్ట్రేషన్ అయిన తరువాత కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాని హెల్త్ కేర్ వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు జీతాలు నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. ‘నో వ్యాక్సిన్-నో శాలరీ’ అన్న పంథాలో ఆయన చేసిన తాజా హెచ్చరిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    రిజిస్ట్రేషన్‌లో పేర్లున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లంతా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఫిబ్రవరి 10 లోపు వ్యాక్సిన్ తీసుకోకపోతే వారికి జీతాలను నిలిపివేస్తామని కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేశారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో హెల్త్ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ తీసుకుని, వ్యాక్సిన్ తీసుకునే సమయం వచ్చేసరికి తమకు వ్యాక్సిన్ వద్దంటూ ముఖం చాటేస్తున్నారని.. రాష్ట్రంలోనే కటక్ జిల్లాలో వ్యాక్సినేషన్ శాతం అత్యల్పంగా నమోదైందని, ఇది ఒక విధంగా జిల్లాకు అవమానకరమైన పరిస్థితి తేవడమేనని కటక్ కలెక్టర్ చాయని కటక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

    ఇదిలా ఉంటే.. భారత్‌లో ఇస్తున్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్లు రెండూ సురక్షితమైనవేనని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని, అయితే కంగారు పడాల్సిన పనేమీ ఉండదని.. ఆ దుష్ప్రభావాలకు చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి సాధారణ జ్వరం, తలనొప్పి, జ్వరం, ఇంజెక్షన్ వేసుకున్న చోట కొంత వాపుతో నొప్పి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు