రగులుతున్న అసోం.. ఇంటర్నెట్ బంద్.. గువాహటిలో కర్ఫ్యూ

గువాహటిలో గురువారం ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ విధించారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించారు.

news18-telugu
Updated: December 11, 2019, 7:35 PM IST
రగులుతున్న అసోం.. ఇంటర్నెట్ బంద్.. గువాహటిలో కర్ఫ్యూ
అసోంలో ఆందోళనలు
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య భారతం రగులుతోంది. అసోం సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు చేరుకొని ఆందోళనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం ఇస్తే..తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు మండిపడుతున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి జరుగుతుందని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసోంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అసోంలోని 10 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు గువాహటిలో గురువారం ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ విధించారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించారు. రాష్ట్రంలో శాంతి, ప్రశాంతతకు సోషల్ మీడియా భంగం కలిగించే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు.
First published: December 11, 2019, 7:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading