CSE ALLEGES MOST TOP BRANDS SELL ADULTERATED HONEY READ HERE MS
Honey Trap: అది స్వచ్ఛమైన తేనె కాదు.. దేశంలో భారీ మోసం వెలుగులోకి.. 77 శాతం కల్తీనే..
ప్రతీకాత్మక చిత్రం
పూర్వకాలంలో గ్రామాలలో తేనె సమృద్ధిగా లభించేది. కానీ రాను రాను సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగలు అంతరించిపోతుండటం.. వాటిని పెంచేవారు లేకపోవడంతో దీనిని కృత్రిమంగా తయారుచేస్తున్నారు. దీనినే పలు బహుళ జాతీయ సంస్థలు ఆసరాగా తీసుకుని కల్తీ తేనెను మార్కెట్లలోకి తీసుకొస్తున్నాయి.
ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే వాటిలో తేనె (Honey) ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకారి. ఎన్ని రోజులైనా నిల్వ ఉండే తేనె లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పూర్వకాలంలో గ్రామాలలో తేనె సమృద్ధిగా లభించేది. కానీ రాను రాను సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగలు అంతరించిపోతుండటం.. వాటిని పెంచేవారు లేకపోవడంతో దీనిని కృత్రిమంగా తయారుచేస్తున్నారు. దీనినే ఆసరాగా తీసుకుని బహుళ జాతీయ సంస్థలు తమ వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ కల్తీ తేనె ను మార్కెట్లలోకి సరఫరా చేస్తున్నాయి.
దేశంలో తేనెను ఉత్పత్తి చేస్తూ.. బ్రాండెడ్ కంపెనీలు గా చలామణి అవుతన్న సంస్థల్లో 77 శాతం సంస్థలకు చెందిన తేనె.. స్వచ్ఛమైన తేనె కాదని తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (cse) పరిశోధనలో ఈ షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దేశంలో తేనెను సరఫరా చేస్తున్న సంస్థలలో డాబర్ (dabur honey), pathanjali, అపిస్ హిమాలయా, బైద్యనాథ్, జండు, dadev, hi honey, socite naturally, hitkari వంటివి ప్రముఖంగా ఉన్నాయి. అయితే పై సంస్థలేవీ సీఎస్ఈ పెట్టిన స్వచ్ఛతా పరీక్ష లో నెగ్గలేదు.
టీవీ ప్రకటనలలో స్వచ్ఛమైన తేనెని ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ఈ సంస్థల ఉత్పత్తులలో అసలు తేనె లేదని.. అదంతా చెక్కర సిరప్ తో తయారుచేసిందేనని సీఎస్ఈ పరిశోధనలో తేలింది. ఇవేవీ FSSI ప్రమాణాలను పాటించడం లేదు. ఇందుకు సంబంధించి సీఎస్ఈ చీఫ్ సునిత నరైన్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. సుమారు 13 సంస్థలకు చెందిన తేనె ఉత్పత్తులను పరీక్షించామని.. కానీ అందులో అపిస్ హిమాలయా మినహా మిగిలిన సంస్థలన్నీ న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ (NMR) పరీక్షలో పాస్ కాలేదని తెలిపారు. జపాన్ కు చెందిన ల్యాబ్ లో ఈ పరీక్షలు నిర్వహించారు.
77% of branded #Honey studied by @CSEINDIA found adulterated with Sugar Syrup in India says CSE
Chinese firms exporting Sugar Syrup 2 India which can't be detected in Indian Honey tests
ఇదే విషయమై సిఎస్ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా స్పందిస్తూ.. తాజా పరిశోధన దేశంలో కల్తీ వ్యాపారం ఎలా విస్తరిస్తుందో చెబుతుందని అన్నారు. తేనెలో కల్తీని పట్టుకోవడం చాలా కష్టమని.. ముందుగా గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) లో పరీక్షలు చేయగా.. పై సంస్థలన్నీ ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. కానీ వీటి స్వచ్ఛత మీద అనుమానం వచ్చి జపాన్ కు పంపించగా.. అక్కడ ఈ కంపెనీల అసలు నిజ స్వరూపం వెలుగులోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం సీఎస్ఈ ఒక రహస్య ఆపరేషన్ ను నిర్వహించందని ఆయన అన్నారు. తేనె కల్తీ వల్ల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో తేనెటీగలు పెంచే రైతులు చాలా నష్టపోతున్నారని ఆయన చెప్పారు.
గతంలో ఈ కంపెనీలేమీ మార్కెట్లలోకి రాకపోయినప్పుడు తేనె ఒక కిలోకు రూ. 150 నుంచి రూ. 200 దాకా అమ్మేవాళ్లమని.. కానీ నేడు అది రూ. 60 నుంచి రూ. 70 లు కూడా దాటడం లేదని రైతులు వాపోయారు. కల్తీ తేనె వ్యాపారం స్థానిక తేనెటీగల పెంపకం దారులను దారుణంగా దెబ్బతీసింది. కాగా, కల్తీ తేనె వ్యాపారాల వెనుక చైనా సంస్థల హస్తముందని తెలుస్తుంది. అక్కడ్నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడాన్ని నిషేధం విధించడంతో.. ఆ సంస్థలు ఇక్కడే బ్రాంచీలు తెరిచి.. అడ్డదారిలో ఈ కల్తీ వ్యాపారానికి వెన్నుదన్నుగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా.. కల్తీ తేనెను ఉత్పత్తి చేస్తున్న సంస్థలపై విచారణకు ఆదేశించామని సీఎస్ఈ తెలిపింది.