Cryptocurrency | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI) దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాలో భారీ పన్ను ఎగవేతను కనుగొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్రం త్వరలో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని పలు వర్గాలు ఎప్పటినుంచే భావిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగడం విశేషం.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI) దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాలో భారీ పన్ను ఎగవేతను కనుగొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. చట్టపరమైన పన్నులను ఎగవేసినందుకు కంపెనీకి రూ. 49.20 కోట్ల జరిమానా విధించిన తర్వాత, DGGI అధికారులు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ సర్వీస్ ప్రొవైడర్ WazirXకి లింక్ చేయబడిన ప్రదేశాలను శోధించారు. GST ముంబై (ఈస్ట్ కమిషనరేట్ జోన్), క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ WazirX వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నప్పుడు, రూ. 40.5 కోట్ల GST ఎగవేతను గుర్తించారు. సంస్థ నుంచి వడ్డీ, జరిమానాతో సహా రూ.49.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీన నియంత్రణపై చర్యలు తేవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రిప్టో కరెన్సీపై ఎటువంటి నియంత్రణా లేదు. పెట్టుబడులు ఆగట్లేదు.
కొన్ని దేశాలు క్రిప్టోలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించగా, మరికొన్ని దేశాలు మాత్రం నిబంధనలతో పనిచేయడానికి అనుమతిస్తున్నాయి. అయితే చాలా దేశాల్లో ఎలాంటి మార్గదర్శకాలు లేవు కాబట్టి వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్‌ను అనుమతిస్తున్నాయి. ప్రభుత్వాలు, రెగ్యులేటర్ల దృష్టిలో క్రిప్టోలను ఎలా వర్గీకరించాలనే దానిపై స్పష్టత లేదు. వీటిని కరెన్సీ లేదా ఆస్తిగా వర్గీకరించడంపైనే.. క్రిప్టోల కార్యాచరణ, వాటిని ఎలా నియంత్రించాలనే అంశాలు ఆధారపడి ఉంటాయి.
ఎల్ సాల్వడార్ దేశం క్రిప్టోను లీగల్ టెండర్‌గా గుర్తించి, అధికారిక చెల్లింపుల కోసం వీటిని ఉపయోగించవచ్చని తెలిపింది. చైనా మాత్రం అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను నిషేధించి సొంతంగా ఒక క్రిప్టోను విడుదల చేసింది. భారతదేశంలో గత ఏడాదిన్నరగా క్రిప్టో పెట్టుబడులు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై నియంత్రణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలని భావిస్తోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.