(రచయిత : పీటర్ సునీల్, జిఎం – డెవలప్మెంట్ సపోర్ట్ (సౌత్), CRY – చైల్డ్ రైట్స్ అండ్ యూ)
14 సంవత్సరాల వయసు కలిగిన శాలిని (పేరు మార్చబడింది) చెంచు అనే గిరిజన వర్గానికి చెందినది, మరియు తన కుటుంబముతో కలిసి తెలంగాణ ప్రాంతములోని కొల్లాపూర్ లో నివసిస్తోంది. శాలినికి పాఠశాలకు వెళ్ళడం అంటే ఇష్టము మరియు తన తరగతిలో అందరి కంటే తెలివైన విద్యార్ధిని. ఆమె భవిష్యత్తులో ఉపాధ్యాయురాలు కావాలని ఆశపడుతోంది. అయితే, శాలిని కలలకు పేదరికము ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఆమె తల్లిదండ్రులు రోజు కూలీలు మరియు శాలిని 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆమె పాఠశాలకు వెళ్ళడం మానేసి తన కుటుంబానికి ఆర్ధికంగా సహాయం చేయడం కోసం కూలీ పనికి వెళ్ళడం మొదలుపెట్టింది. CRY ప్రాజెక్ట్ భాగస్వామి శ్రామిక వికాస కేంద్రం (SVK) విషయం తెలుసుకున్నప్పుడు, ఆ సంస్థ యొక్క సభ్యులు జోక్యం చేసుకొని, ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆమెను సమీప పాఠశాలలో తిరిగి-నమోదు చేశారు మరియు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ ప్రయోజనాలను అందుకొనుటలో ఆమెకు సహాయం చేశారు, ఇది ఆమె తల్లిదండ్రులపై ఆర్ధిక భారాన్ని వేయకుండా పాఠశాల విద్యాభ్యాసం కొనసాగించుటకు సహాయపడుతోంది.
Read This : Telangana: గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు..వెనక్కి తగ్గిన కౌశిక్ రెడ్డి..ఏమన్నారంటే?
అయితే, గిరిజనుల కొరకు స్కాలర్షిప్ ప్రోత్సాహకాలలో, ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2023-2024 కేటాయింపులలో ప్రకటించబడిన తగ్గుదలతో, విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి తమ కలలను సాకారం చేసుకోవడములో సహాయం చేసే ఈ పథకము యొక్క ప్రయోజనాలను అందుకోవాలని ఆశిస్తూ వచ్చే శాలిని మరియు వెనుకబడిన జనాభా నుండి వచ్చే అనేకమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చు.
ఇటీవల ప్రకటించబడిన కేంద్ర బడ్జెట్ 2023-2024 లో, ఈ సంవత్సరం గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద ఎస్టీల కొరకు ఉన్న ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ యొక్క భాగము 108% తగ్గుదలను (2022 – 23 (ఆర్ఈ) కంటే 15.2% పెరుగుదల) చవిచూసింది, తరువాతది 2022 – 23 (బిఈ) కంటే 14.7% తగ్గుదలను చవిచూసింది) (కింది పట్టికను చూడండి).
పట్టిక: గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద పిల్లల-సంబంధిత పథకాలు/కార్యక్రమాలు
2022-23 (రూ. కోట్లలో బీఈ) | 2022-23 (రూ. కోట్లలో ఆర్ఈ) | 2023-24 (రూ. కోట్లలో) | బీఈ యొక్క % మార్పు (22-23) కన్నా (23-24) | ఆర్ఈయొక్క % మార్పు (22-23) కన్నా (22-23) బీఈ | బీఈ యొక్క % మార్పు (22-23) కన్నా ఆర్ఈ (23-24) | |
ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ | 419 | 357 | 412 | -1.8 | -14.7 | 15.2 |
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) | 2,000 | 1,985 | 5,927 | 196.4 | -0.7 | 198.6 |
అయితే, గిరిజన వర్గాల జీవితాలలో సానుకూల మార్పు తీసుకొనివచ్చేందుకు, ప్రభుత్వము ఈ సంవత్సరము గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈ.ఎం.ఆర్.ఎస్) కొరకు బడ్జెట్ కేటాయింపును సవరించింది. గత సంవత్సరం నుండి, ఈ.ఎం.ఆర్.ఎస్ కొరకు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపు 196.4% పెరిగింది (2022-23(ఆర్ఈ) కంటే 198.6% పెరుగుదల) (పై పట్టికను చూడండి). ఇది గిరిజన వర్గాలకు చెందిన పిల్లలు నాణ్యమైన విద్యను అందుకొనుటకు, అభ్యసించుటకు అవకాశాన్ని నిర్ధారించే ఒక భారీ చర్య. అలాగే, రాబోయే మూడు సంవత్సరాలలో 740 ఈ. ఎం. ఆర్. ఎస్ లలో 3.5 లక్షలమంది గిరిజన పిల్లలకు సేవలను అందించుటకు 38,800 ఉపాధ్యాయులు మరియు సహాయక సిబ్బంది నియామకము ప్రకటించబడింది.
Read This : Chandrababu: పోలీసు శాఖను మూసేశారా..? గన్నవరం విధ్వంసంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న చంద్రబాబు
నిధుల కేటాయింపు విషయానికి వస్తే, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద, పిల్లల-కేంద్రీకృత కార్యక్రమాల కొరకు బడ్జెట్ లో 162.1% అంటే 2023 – 24 (బీఈ) లో రూ. 6339 కోట్లకు పెరుగుదల ఉంది. ఇది , 2022 – 23 (బీఈ) లో రూ. 2419 కోట్లతో పోలిస్తే పెరిగింది.
పట్టిక: పిల్లల-కేంద్రీకృత జోక్యాలపై[2] మంత్రిత్వశాఖ/విభాగము-వారి బడ్జెట్ కేటాయింపులు
మంత్రిత్వశాఖలు/విభాగాలు | 2022-23 (రూ కోట్లలో బీఈ | 2022-23 (రూ కోట్లలో ఆర్ఈ | 2023-24 (రూ కోట్లలో బీఈ | % షేర్ 2022-23 (బీఈ) | % షేర్ 2022-23 (ఆర్ఈ) | % షేర్ 2023-24 (బీఈ) | % మార్పు బీఈ (22-23) కన్నా బీఈ (23-24) | % మార్పు (22-23) కన్నా ఆర్ఈ (22-23) | % మార్పు (23-24) బీఈ కన్నా (22-23) ఆర్ఈ |
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ | 2,419 | 2,342 | 6,339 | 2.6 | 2.6 | 6.1 | 162.1 | -3.2 | 170.7 |
2023 – 24 (బిఈ) కొరకు మొత్తం పిల్లల బడ్జెట్ లో, 2022 – 23 (బీఈ) కొరకు కేటాయింపు కంటే 11.9% పెరుగుదలను మరియు 2022 – 23 కొరకు ఆర్ఈ కంటే 16.6% పెరుగుదలను చూపింది. మొత్తమ్మీద, ఇవి బడ్జెట్ ఫర్ చిల్డ్రెన్ ఎఫ్వై 23 – 24 లో నిధుల కేటాయింపులో గణనీయమైన పెంపును చవిచూసిన భాగాలు. అయితే , పోషకాహారం మరియు రక్షణలో ముఖ్యంగా విద్యకు (స్కాలర్‌షిప్‌లు) సంబంధించిన కొన్ని అంశాలు మరింత శ్రద్ధ మరియు కేటాయింపు అవసరం. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల సమగ్ర ఎదుగుదల మరియు అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు అవసరమైన ప్రతి అంశం పట్టించుకోకుండా ఉండేలా ఇది చాలా కీలకం. అన్నింటికంటే, భారతదేశపు పిల్లల జీవితం మరియు అభివృద్ధి సరైన అర్థంలో, తగినంత బడ్జెట్ మద్దతుతో పురోగమిస్తుంది.
సంపాదకుడికి గమనిక:
సిఆర్వై గురించి -
సిఆర్వై – పిల్లల హక్కులు మరియు మీరు అనేది పిల్లలందరికి సంతోషకరమైన బాల్యాన్ని నిర్ధారించే దిశగా పనిచేసే ఒక భారతీయ ఎన్జిఓ. గత 4 దశాబ్దాలుగా, సిఆర్వై మరియు దాని భాగస్వాములు భారతదేశములో 3 మిలియన్ల వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లల జీవితాలలో మార్పులను నిర్ధారించారు. మరిన్ని వివరాల కొరకు సందర్శించండి www.cry.org. https://www.facebook.com/CRYINDIA/https://twitter.com/CRYINDIAhttps://www.instagram.com/cry_india/https://www.linkedin.com/company/38732/admin/https://www.youtube.com/c/CRYChildRightsandYou
మీడియా ప్రశ్నల కొరకు, దయచేసి లిబ్జా మన్నన్ ను libza.mannan@crymail.org వద్ద సంప్రదించండి లేదా +91 8377862447 పై కాల్ చేయండి
గమనికలు: బీఈ: బడ్జెట్ ఎస్టిమేట్; ఆర్ఈ: రివైస్డ్ ఎస్టిమేట్. సోర్స్: భారతీయ కేంద్ర బడ్జెట్ 202 – 2024 యొక్క స్టేట్మెంట్ 12 నుండి సంగ్రహించబడినది
గమనికలు: బీఈ: బడ్జెట్ ఎస్టిమేట్; ఆర్ఈ: రివైస్డ్ ఎస్టిమేట్. సోర్స్: భారతీయ కేంద్ర బడ్జెట్ 202 – 2024 యొక్క స్టేట్మెంట్ 12 నుండి సంగ్రహించబడినది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Budget 2023, Children, India