హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

diabetes care : డయాబెటిస్‌ చికిత్సకు రాయితీ -సుప్రీంకోర్టు CJI Ramana

diabetes care : డయాబెటిస్‌ చికిత్సకు రాయితీ -సుప్రీంకోర్టు CJI Ramana

డయాబెటీస్ పై సీజేఐ రమణ కీలక వ్యాఖ్యలు

డయాబెటీస్ పై సీజేఐ రమణ కీలక వ్యాఖ్యలు

నిశ్శబ్ధ మహమ్మారి డయాబెటిస్ వల్ల కలుగుతోన్న నష్టం మాటల్లో చెప్పలేనిదని, చక్కెర వ్యాధి వల్ల దేశంపై పడుతోన్న ఆర్థిక భారం అంచనాలకు అందనిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. డయాబెటిస్ చికిత్సకు రాయితీలు అందించాలని ప్రతిపాదించారు.

ఇంకా చదవండి ...

క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, తాజాగా కరోనా చికిత్స కోసం లక్షలాది రూయాల ఖర్చు.. ఇలా పైకి భారీగా కనిపించే రోగాల కంటే కూడా దేశ ప్రజలను గుల్ల చేస్తూ, పేదల జేబులనూ ఖాళీ చేస్తోన్న డయాబెటిస్ ను ‘నిశ్శబ్ద మహమ్మారి’గా అభివర్ణించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. డయాబెటిస్ వల్ల కలుగుతోన్న నష్టం మాటల్లో చెప్పలేనిదని, చక్కెర వ్యాధి వల్ల దేశంపై పడుతోన్న ఆర్థిక భారం అంచనాలకు అందనిదని ఆయన అన్నారు. డయాబెటిస్‌పై అవగాహనకు సంబంధించిన ఓ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ మాట్లాడుతూ ప్రభుత్వాలకు సంచలన సూచనలు చేశారు. డయాబెటిస్ చికిత్సకు రాయితీలు అందించాలని ప్రతిపాదించారు. వివరాలివి..

డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి చికిత్స అందించడం కోసం ప్రభుత్వాలు రాయితీ ఇవ్వాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. మధుమేహానికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకొన్నదని, ఇది పేదల పాలిట శత్రువుగా మారిందని గుర్తు చేసిన ఆయన.. డయాబెటిస్‌ ఎంత ప్రమాదకారో కొవిడ్‌ నిరూపించిందన్నారు. వైరస్‌తో డయాబెటిక్‌ రోగులకు ఎక్కువ ప్రాణహాని ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కొవిడ్‌ ఒక వేవ్‌లాగా వస్తే డయాబెటిస్‌ మాత్రం దశాబ్దాలుగా విస్తరిస్తూ ప్రాణాలను కబలిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులే గ్యాంగ్ రేప్ చేశారు -ఇద్దరమ్మాయిలతో మసాజ్ కావాలంటూ -అటు ఇటు మార్చుకుంటూ దారుణంగా..



డయాబెటిస్‌పై భారత్‌ కేంద్రంగా అధ్యయనాలు రావాల్సి ఉందని, షుగర్ లెవల్స్ ఎంతుండాలో కచ్చితమైన ప్రమాణాలను రూపొందించుకోలేకపోతున్నామని సీజేఐ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. నిశ్శబ్ద మహమ్మారి డయాబెటిస్‌ను శాశ్వతంగా దూరం చేయడానికి భారత్ పరిశోధనలు జరపాల్సి ఉందని, ఔషధాన్ని వీలైనంత వేగంగా కనుక్కోవాలని, త్వరలోనే మందు అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నానని, వైద్యులు, శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సీజేఐ రమణ కోరారు. నిజానికి డయాబెటిస్‌ అనేది ఆధునిక జీవన విధానం సృష్టించిన ఉత్పత్తే అన్నారాయన.

cm kcr : ఇక ఢిల్లీలో దబిడి దిబిడే -ఓపిక పట్టంది చాలు.. గట్టిగా కొట్లాడండి -మోదీ సర్కారును ఎండగట్టండి..



మధుమేహం ధనవంతులకు మాత్రమే వచ్చే జబ్బు అని గతంలో అపోహ ఉండేదని, గడిచిన రెండు దశాబ్దాలుగా ఇది క్రమంగా పెరుగుతూ వచ్చిందని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామందికి డయాబెటిస్ వచ్చిందని, ఈ నేపథ్యంలోనే షుగర్ వ్యాది చికిత్సకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని, భారత్ కేంద్రంగానే మందును కనిపెట్టాలని సీజేఐ రమణ అన్నారు.

First published:

Tags: Diabetes, NV Ramana, Supreme Court

ఉత్తమ కథలు