Maoists Attack in Chhattisgarh: అది ఛత్తీస్‌గఢ్... సుకుమా జిల్లాలోని... తాడ్‌మెట్ల గ్రామం. అక్కడో పెద్ద అడవి ఉంది. శనివారం రాత్రి 9 గంటలకు... సెర్చ్ ఆపరేషన్ ముగించి... కాలి నడకన రిటర్న్ వస్తున్నాయి భద్రతా బలగాలు. సరిగ్గా ఓ చోటికి రాగానే... భారీ శక్తిమంతమైన IED పేలుడు. ఒక్కసారిగా బలగాలు ఎగిరిపడ్డాయి. క్షణాల్లో అంతా అల్లకల్లోలం. అంతా చీకటి. ఎదురుగా చూస్తే... కోబ్రా యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ పి బాలేరావ్... నిశ్చలనంగా కనిపించారు. ఆయన్ని కదిపి చూడగా... ప్రాణాలతో ఉన్నట్లు తేలింది. వేగంగా ఆయన్ని ట్రీట్‌మెంట్ కోసం రాయ్ పూర్ తరలించారు. మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఒక్కసారిగా ఇతర సైనికులంతా విషాదంలో మునిగిపోయారు.
బాలేరావ్ మరో 9 మంది CRPFకి చెందిన వారు ఎలైట్ కమాండో వింగ్‌గా ఏర్పడ్డారు. వీరు బుర్కాపాల్‌లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఐతే... మావోయస్టులకు ఆ ప్రాంతంపై పట్టుంది. ఎక్కడ బడితే అక్కడ IEDలను అమర్చుతున్నారు. ఈ విషయం తెలియని ఆఫీసర్లు దాడిలో చిక్కుకున్నారు. బాలేరావ్ చనిపోగా... మరో 8 మందికి గాయాలయ్యాయి.
బాలేరావ్ పార్ధివదేహాన్ని సొంత రాష్ట్రం మహారాష్ట్రలోని నాశిక్ పట్టణానికి తీసుకెళ్లనున్నారు. ఆయనకు ఓ భార్య, ఓ కూతురు ఉన్నారు. తమపై ఆపరేషన్ నిర్వహిస్తున్నారనే పగతోనే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
ఈ దాడిలో రెండు IEDలు పేలినట్లు పోలీసులు చెబుతున్నారు. సుకుమా జిల్లాలోని చింతగుఫలో... అర్బాజ్ మేట అనే ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Hyderabad Elections: భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమిత్ షా పూజలు... తర్వాత ప్రచారం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మధ్యే నక్సల్స్ వ్యూహాలపై రివ్యూ జరిపారు. నక్సల్స్ అణచివేతపై వెనక్కి తగ్గొద్దని ఆదేశాలిచ్చారు. రాష్ట్ర పోలీసలు, కేంద్ర బలగాల మధ్య సహకారం బాగా ఉండాలన్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ జోరుగా సాగుతోంది. 2017 నుంచి ఇప్పటివరకు చింతగుఫ ఏరియాలో 25 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కంటిన్యూగా నక్సలైట్లు తమకార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. దట్టమైన అడవులు ఉండటంతో... భద్రతా బలగాలకు చిక్కకుండా పారిపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maoist attack