Home /News /national /

CROWDED SHOPS CLOTHING STORES WINE SHOPS BUS STANDS FULL IN TAMILNADU VB

Crowded people: ఆషాఢం వేళ.. కోవిడ్ నిబంధనలు పాతర.. అక్కడ కిక్కిరిసిన జనాలు..

ఆషాఢం వేళ.. కోవిడ్ నిబంధనలు పాతర (Image credit : twitter)

ఆషాఢం వేళ.. కోవిడ్ నిబంధనలు పాతర (Image credit : twitter)

Crowded people: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తమిళనాడులో లాక్ డౌన్ ను ఎత్తేశారు. అయితే చెన్నైలో ఒక బట్టల షాపులో కొనడానికి వచ్చిన జనం చూస్తే ఇక్కడ కరోనా అన్న మాట తెలియదా..అన్నట్లు ఉంది. మనిషికి మనిషికి మధ్య కనీసం రెండు అడుగుల దూరం కూడా లేకుండా కిక్కిరిసిపోయి ఉన్నారు జనాలు.

ఇంకా చదవండి ...
    కరోనాతో గడగడలాడిన జనం ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అడుగు బయట పెట్టేందుకు వణికిన వారు.. ప్రస్తుతం ఆ ఊసే లేకుండా సంచరిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ప్రభుత్వం నిబంధనలు సడలిస్తూ వచ్చింది. కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడం.. ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడంతో మళ్లీ కరోనాకు ఊపిరిచ్చినట్లైంది. కరోనా మళ్లీ విజృంభిస్తున్నా జనం ఏమాత్రం జంకడంలేదు. జాగ్రత్తలు.. హెచ్చరికలను ఆలకించడమే లేదు. తమిళనాడులో జనం గుమికూడే ప్రదేశాల్లోనూ, ప్రయాణ సమయాల్లోనూ కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. మెజార్టీ ప్రజలు కనీసం మాస్కులు ధరించడం మానేశారు. కొవిడ్ లాక్ డౌన్.. అన్ లాక్ మొదలైన వేళ జనం షాపులకు క్యూకట్టారు. చెన్నైలో ఒక బట్టల షాపులో ఇవాళ కొనడానికి వచ్చిన జనం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.

    మనిషికి మనిషికి మధ్య కనీసం రెండు అడుగుల దూరం కూడా లేకుండా కిక్కిరిసిపోయి ఉన్నారు జనాలు. ఆషాఢ మాసం కావడంతో కొత్త బట్టలు, ఇంట్లో వస్తులు కొనుక్కోవడానికి ఇలా బయటకు వచ్చారు. ఎక్కడ చూసిన ఇసుక వేస్తే రాలనంత జనంతో గుమికూడారు. ఏ దుకాణంలో చూసినా జనాలు కిక్కిరిసిపోయి కనిపించారు. ఇక మందుబాబుల విషయానికి వస్తే.. కొరివితో తలగోక్కోవడం, కరోనాతో చెలగాటం రెండూ ఒక్కటే. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో కూర్చుంటేనే వైరస్ సోకుతున్న రోజులివి. అలాంటిది గుంపుల్లోకి వెళ్తే ఇంకేముంది.. కరోనాను కౌగిలించుకున్నట్టే. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటే పొరపాటే. వైన్ షాపుల ముందు కూడా మందుబాబులు పోటెత్తారు.

    ఒక్కసారిగా మద్యం కోసం ఎగబడుతూ కొవిడ్ నిబంధనలు మరిచిపోయారు. పది రోజులకు సరిపడా మందు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ ఎత్తేసినా కేసులు మాత్రం చాపకింద నీరులా పెరుగుతూనే ఉన్నాయి. అయినా ఏ మాత్రం భయం లేకుండా ఇలా విచ్చలవిడిగా తిరుతున్నారు. అటు, కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్​లు కూడా జనాలతో కిటకిటలాడాయి. సొంత గ్రామాలకు చేరుకునేందుకు వస్తున్న జనాలతో బస్టాండ్లు కిక్కిరిపోయాయి.
    Published by:Veera Babu
    First published:

    Tags: Covid rules, Tamilanadu, Unlock

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు