• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CROWD GATHERS OUTSIDE THE HOUSE OF CRPF PERSONNEL ASHWINI KUMAR YADAV IN UP SK

అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు... భారీగా తరలివచ్చిన జనం

అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు... భారీగా తరలివచ్చిన జనం

ఆయన్ను కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. 'అశ్విని కుమార్ అమర్ హై' అంటూ నినాదాలు చేశారు.

ఆయన్ను కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. 'అశ్విని కుమార్ అమర్ హై' అంటూ నినాదాలు చేశారు.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్ వల్ల జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్‌ కోసం జనం లాక్‌డౌన్ ఆంక్షలను తెంచుకున్నారు. కన్నీటితో ఆ వీరసైనికుడికి తుది వీడ్కోలు పలికారు. యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటచేసుకుంది. జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యూపీకి చెందిన అశ్వినీ కుమార్ మరణించారు. నిన్న ఆయన భౌతిక కాయం స్వగ్రామానికి చేరుకుంది. ఇవాళ అంత్యక్రియలు జరిగాయి. దాంతో ఆయన్ను కడసారి చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. 'అశ్విని కుమార్ అమర్ హై' అంటూ నినాదాలు చేశారు.

    జమ్ముకశ్మీర్‌లోని హంద్వారా సెక్టార్‌లో మంగళవారం ఉదయం భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో అశ్వినీ కుమార్‌ యాదవ్‌తోపాటు మరో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు