Home /News /national /

CRORE OF RUPEES CREDITED IN BANK ACCOUNT OF POOR OLD MAN VRY

Money money : నిరుపేద అకౌంట్‌లో డబ్బే డబ్బు.. ఎలా వచ్చిందో తెలియదు.. ఆ డబ్బు ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Money money : ఓ అనామకుడి అకౌంట్‌లో ఏకంగా కోట్ల రూపాయల డబ్బులు క్రెడిట్ అయ్యాయి.. అయితే తనది కాని డబ్బును చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా అంత డబ్బు చూడడంతో అశ్చర్యానికి లోనయ్యాడు. ఇలా కోట్ల రూపాయలు ఎలా తన అకౌంట్‌లోకి వచ్చాయో అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇంకా చదవండి ...
    మానిటైజేషన్ తర్వాత అనామకుల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అవ్వడం కామన్‌గా మారిపోయింది.. దేశంలో ఎక్కడో ఓ చోట కొన్ని ఖాతాల్లో వారికి సంబంధం లేకుండా కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. అయితే ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయో అనే అచూకి మాత్రం తెలియడం లేదు.. కొన్ని సార్లు బ్యాంకర్ల తప్పిదాల వల్ల అకౌంట్లలలో కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి.

    ఇలా ముందుగా తెలియని వారి అకౌంట్లలో డబ్బులు జమ తర్వాత అకౌంట్ హోల్డర్లు ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి..ఈ క్రమంలోనే తాజాగా మరో నిరుపేద వృద్దుడి ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయ్యాయి.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 కోట్ల రూపాయలు ఆ నిరుపేద అకౌంట్లో జమ అయ్యాయి.

    Constable remand : మహిళా కానిస్టేబుల్‌‌తో క్లోజ్.. రెండు సార్లు గర్భం చేసి.. ఆ తర్వాత..!

    వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో పూలో రాయ్..కుటుంబం నివాసం ఉంటోంది. భార్య, కుమారుడితో కలిసి ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయమే వారి జీవనాధారం..దాని ద్వారా వచ్చే డబ్బును బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తూ ఉంటాడు... అయితే రాయ్ కినారిలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో అకౌంట్ ఉంది. ఇటివల రాయ్ తన అకౌంట్‌లో డబ్బులు తీసుకోవాలని బ్యాంకుకు వెళ్లాడు. రూ. 10 వేలు విత్ డ్రా చేసుకున్నాడు. అనంతర అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో తెలుసుకున్నాడు . దీంతో ఆశ్చర్యపోవడం రాయ్ వంతయింది... తన అకౌంట్లో తాను ఊహించనంత డబ్బు వచ్చి చేరింది. ఇలా ఏకంగా తన అకౌంట్లో రూ 75.28 కోట్లు ఉన్నట్లు గుర్తించాడు. అయితే..ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడ లేదని వెల్లడించారు. వెంటనే వెళ్లి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. కాగా ఈ సంఘటనపై బ్యాంకు అధికారులు స్పందించారు. డబ్బులు ఎక్కడి నుంచి జమయ్యాయో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bank, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు