పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని 1000 మంది ప్రముఖుల డిమాండ్

పౌరసత్వ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా ప్రజలకు బాధలను మిగులుస్తుందని, ఇది దేశ రిపబ్లిక్ స్వభావాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని వారు తెలిపారు. బిల్లును ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వానికి కోరారు.

news18-telugu
Updated: December 10, 2019, 10:20 PM IST
పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని 1000 మంది ప్రముఖుల డిమాండ్
అమిత్ షా (File Photo)
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని దాదాపు 1000 మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు డిమాండ్​ చేశారు. విజ్ఞప్తి చేసినవారిలో వారిలో హార్వర్డ్​, మసాచుసెట్స్, ఢిల్లీ యూనివర్సిటీ సహా పలు ఐఐటీ, ఐఐఎస్​ఈఆర్​, ఐఐఎస్​ అనుబంధ సంస్థల విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అలాగే ప్రముఖుల్లో నయన్ తార సెహగల్,అరుంధతీరాయ్, అమితవ్ ఘోష్ వంటి రైటర్లు, టీఎమ్ క్రిష్ణ, సుధీర్ పట్వర్థాన్, నీలిమా షేక్ వంటి ఆర్టిస్టులు, అపర్ణ సేన్, నందితా దాస్ వంటి ఫిల్మ్ మేకర్లు, రామచంద్రగుహ వంటి చరిత్రకారులు, అరుణ్ రాయ్, తీస్తా సెతల్వాడ్, హర్ష్ మందర్ వంటి యాక్టివిస్టులు, యోగేంద్ర యాదవ్, ఏపీ షా, నందిని సుందర్ వంటి రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా ప్రజలకు బాధలను మిగులుస్తుందని, ఇది దేశ రిపబ్లిక్ స్వభావాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని వారు తెలిపారు. బిల్లును ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వానికి కోరారు.
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading