Home /News /national /

CRIME NEWS 11 SKULLS 54 FETAL BONES IN BIOGAS PLANT SUSPECTED TO BE ILLEGAL ABORTIONS IN MAHARASHTRA EVK

Crime News: బయోగ్యాస్ ప్లాంట్‌లో 11 పుర్రెలు, 54 పిండాల‌ ఎముకలు.. అక్ర‌మ అబార్ష‌న్‌లుగా అనుమానం!

crime scene

crime scene

Crime News | మహారాష్ట్ర (Maharashtra) లోని వార్ధా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. జ‌న‌వ‌రి 12, 2022న వార్ధా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆవరణలో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభ్యమయ్యాయి. దీంతో ఒక్కసారిగా న‌గ‌రం అంతా ఉలిక్కిప‌డింది. ఈ అవ‌శేషాల‌కు అక్ర‌మ అబార్ష‌న్‌లే కార‌ణం అని అధికారులు భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    మహారాష్ట్ర (Maharashtra) లోని వార్ధా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. జ‌న‌వ‌రి 12, 2022న వార్ధా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆవరణలో 11 పుర్రెలు, 54 పిండాల ఎముకలు లభ్యమయ్యాయి. దీంతో ఒక్కసారిగా న‌గ‌రం అంతా ఉలిక్కిప‌డింది. ఈ అవ‌శేషాల‌కు అక్ర‌మ అబార్ష‌న్‌ (Abortion)లే కార‌ణం అని అధికారులు భావిస్తున్నారు. ఈ అక్రమ అబార్షన్ కేసు ను విచారించేందుకు పోలీసులు వెంట‌నే ఆసుపత్రికి చేరుకున్నారు. అక్క‌డ ఉన్న మానవ అవశేషాలను గుర్తించారు. ఒక ప‌క్కా స‌మాచారంతోనే వార్ధా న‌గ‌రంలో జ‌న‌వ‌రి 13, 2022న ఆర్వీ తహసీల్‌లోని కడం ఆసుపత్రి ఆవరణలో ఉన్న బ‌యోగ్యాస్ ప్లాంట్‌ (Bio Gas Plant) లో పోలీసులు సోదాలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీలో వారికి వారు 11 పుర్రెలు మరియు 54 పిండాల ఎముకలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వీటిని ఫోరెన్సి (Forensic) క్ ప‌రీక్ష‌ల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

    Crime News: ఫ‌స్ట్ ప్రొఫెల్ లైక్ చేస్తాడు.. త‌ర్వాత మాట‌లు.. ఇలా 26 మందితో..


    13 ఏళ్ల బాలిక‌కు అక్ర‌మ గ‌ర్భ‌స్రావం..
    ఈ ఘ‌ట‌న‌పై పోలీసు (Police) లు స్పందించారు. విచారణ సరైన దిశలోనే సాగుతున్నట్లు స్ప‌ష్టం చేశారు. అక్క‌డ దొరికిన అవ‌శేషాలు అన్ని చట్టవిరుద్ధంగా పారవేయబడ్డాయా అని నిర్ధారించడానికి అవ‌స‌ర‌మైన సాక్షాల‌ను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అక్రమ అబార్షన్లు (Illegal Abortions)జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వార్ధాలోని ఆర్వీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ భానుదాస్ పిదుర్కర్ మాట్లాడుతూ.. 13 ఏళ్ల బాలికకు అక్రమంగా గర్భస్రావం చేసినందుకు గతంలో పోలీసులు డాక్టర్ రేఖ కదమ్, ఆసుపత్రి నర్సును అరెస్టు చేసినట్లు తెలిపారు.

    13 ఏళ్ల బాలిక గ‌ర్భ‌వ‌తి అయిన విష‌యం గుర్తించిన బాలిక తండ్రి అందుకు కార‌ణం అయిన బాలుడి తండ్రితో మాట్లాడాడు. ఈ విష‌యం ఎవ‌రికైన చెబితే బాలిక కుటంబ స‌భ్యుల ప‌రువు తీస్తాన‌ని అబ్బాయి తండ్రి బెదిరించాడు. గుట్టు చ‌ప్పుడు కాకుండా అబార్ష‌న్ చేయించ‌మ‌ని సూచించాడు. అందుకు ఖ‌ర్చులు భ‌రిస్తాన‌ని చెప్పాడు. తర్వాత బాలికను డాక్టర్ రేఖా నీరజ్ కదమ్ ఆసుపత్రిలో చేర్చారు.

    Crime News: 18 ఏళ్ల యువ‌కుడితో జాకెట్ కోసం జ‌గ‌డం.. చివ‌రి ఇలా అయ్యింది!


    ఈవిష‌యం తెల‌సుకొన్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో అబార్షన్‌కు పాల్పడడం ఇదే తొలిసారి కాకపోవచ్చునని పోలీసులు అనుమానించారు. వెంట‌నే విచార‌ణ ప్రారంభించారు. ఆస్పత్రి వెనుక ఉన్న ఆవు పేడ గ్యాస్‌ ప్లాంట్‌ (Gas Plant) లో సోదాలు నిర్వ‌హించారు. అక్క‌డ 8 పుర్రెలు, 55 ఎముకలు లభ్యమయ్యాయి. 8 నెలలుగా జరుగుతున్న అబార్షన్ గురించి పోలీసులకు సమాచారం అందిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఆసుపత్రి (Hospital) రిజిస్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందరి డీఎన్‌ఏ చేస్తానని పోలీసులు చెప్పారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Crime, Crime news, Maharashtra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు