హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bipin Rawat: శుక్రవారం సాయంత్రం జరగనున్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు

Bipin Rawat: శుక్రవారం సాయంత్రం జరగనున్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు

బిపిన్ రావత్ (ఫైల్ ఫోటో)

బిపిన్ రావత్ (ఫైల్ ఫోటో)

తమిళనాడులోని (Tamilnadu) నీలగిరి హిల్స్‌లో ఐఏఎఫ్ చాపర్ (IAF Chopper Crash) కూలిన ఘటనలో అకాల మరణం చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat), ఆయన భార్య మధులిక రావత్ (Madhulika Rawat) అంత్యక్రియలు డిసెంబర్ 10న సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్‌లో (Delhi Contonment) సైనిక లాంఛనాలతో జరగనున్నట్లు తెలిసింది.

ఇంకా చదవండి ...

  నీలగిరి హిల్స్: తమిళనాడులోని (Tamilnadu) నీలగిరి హిల్స్‌లో ఐఏఎఫ్ చాపర్ (IAF Chopper Crash) కూలిన ఘటనలో అకాల మరణం చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat), ఆయన భార్య మధులిక రావత్ (Madhulika Rawat) అంత్యక్రియలు డిసెంబర్ 10న సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్‌లో (Delhi Contonment) సైనిక లాంఛనాలతో జరగనున్నట్లు తెలిసింది. వారి పార్థివ దేహాలను శుక్రవారం ఢిల్లీకి తీసుకురానున్నారు. ఉదయం 11 నుంచి 2 గంటల వరకూ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌కు పలువురు ప్రముఖులు అంజలి ఘటించనున్నారు.

  అనంతరం.. కామరాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్‌లోని ఆర్మీ క్రిమియేషన్ గ్రౌండ్ (Army Cremation Ground) వరకూ అంతిమ యాత్ర జరగనుంది. సైనిక మర్యాదలతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక దహన సంస్కారాలు జరగనున్నాయి. తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఉదయం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది.

  ఇది కూడా చదవండి: Mi-17V5 Helicopter: వీవీఐపీల హెలికాప్టర్‌ ఇదే! ప్రమాదానికి కారణాలు ఇవే అని తేల్చిన వాయుసేన

  ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉండటంలో అంతా అప్రమత్తమయ్యారు. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం... నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే అనంతరం అందులో 14 మంది ఉన్నట్టు ధృవీకరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది.

  ఇది కూడా చదవండి: Gen Bipin Rawat దుర్మరణం -దేశానికి కొత్త CDS ఎవరు? -దక్షిణాదికి చెందిన అధికారేనా?

  ఈ ఘటనలో ఏపీ వాసి అయిన సాయితేజ్ కూడా చనిపోయారు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో సాయితేజ్ ఆర్మీలో చేరారు. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె(3), కుమారుడు (5)ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bipin Rawat, Helicopter Crash, National News, Tamilnadu

  ఉత్తమ కథలు