Home /News /national /

Farmers Protest: రైతుల తలలు పగలాలి.. నేను చూడాలి... పోలీసులకు అధికారి ఆదేశం.. వీడియో వైరల్

Farmers Protest: రైతుల తలలు పగలాలి.. నేను చూడాలి... పోలీసులకు అధికారి ఆదేశం.. వీడియో వైరల్

కర్నాల్ ఎస్డీఎం ఆయుష్ సిన్హా

కర్నాల్ ఎస్డీఎం ఆయుష్ సిన్హా

Farmers Protest: హరియాణాలో రైతులపై లాఠీచార్జ్ ఘటనపై దుమారం రేగుతోంది. రైతుల తలలను పగులగొట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆదేశించడంతోనే పోలీసులు రెచ్చిపోయారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించి ఎస్డీఎం ఆదేశాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి ...
  కొత్త వ్యవసాయ చట్టాల (New Agriculture Laws)కు వ్యతిరేకంగా గత ఏడాది నుంచి పలుచోట్ల రైతులు (Farmers) ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. ఐతే శనివారం హరియాణా (Haryana)లోని కర్నాల్ జిల్లాలో చేసిన రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో దాదాపు మంది రైతులు గాయపడ్డారు. పలువురికి రక్తస్రావమయంది. ఐతే కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా ఆదేశాల మేరకే రైతులపై పోలీసులు లాఠీ చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల తలలు పగులకొట్టాలని SDM ఆదేశించారని.. అందుకే పోలీసులు రెచ్చిపోయారని దుమారం రేగుతోంది. అధికారుల తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

  శనివారం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manoharlal khattar), రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు ఓం ప్రకాశ్ ధనాకర్, మరికొందరు నేతలు కర్నాల్‌ (Karnal)లో జరిగిన ఓ సమవేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి అడ్డుకునేందుకు కొందరు రైతులు ఆందోళన చేశారు. హైవే మీది నుంచి ర్యాలీగా వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. బ్యారీకేడ్లు ఏర్పాటు చేసిన ఎక్కడికక్కడ అడ్డగించారు. ఐనప్పటికీ రైతుల ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రైతులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 10 మంది రైతులకు గాయాలయ్యాయి. కొందరి తలలకు గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. రైతులెవరూ ఇక్కడికి రాకూడదని.. వస్తే తలలు పగులకొట్టాలని కర్నాల్ ఎస్డీఎమ్ ఆయుష్ సిన్హా పోలీసులను ఆదేశిస్తున్నట్లు అందులో ఉంది.

  Mann Ki Baat: స్వచ్ఛ భారత్‌ మర్చిపోవద్దు.. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర  మోదీ పిలుపు

  '' వారు ఎవ‌రైనా గానీ.. ఎక్క‌డి నుంచి నుంచైనా రానీ.. ఎవ్వ‌రినీ బారికేడ్లు దాటి ముందుకు పంపించ‌కూడ‌దు. ఇక్క‌డికి ఎవరైనా వస్తే మీ లాఠీ తీసుకొని వాళ్ల‌ను కొట్టండి. వాళ్ల త‌ల మీద గ‌ట్టిగా కొట్టండి. దానికి ఎవరి ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ మీకు అవసరం లేదు. ఒక్క నిర‌స‌న‌కారుడు నాకు ఇక్క‌డ క‌నిపించినా, అత‌డి త‌ల ప‌గిలి క‌నిపించాలి. వాళ్ల త‌ల‌లను మీ లాఠీల‌తో ప‌గుల‌గొట్టండి.'' అని ఆయుష్ సిన్హా పోలీసులకు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఎడిట్ చేశారని.. డీఎం అలా ఆదేశించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో సొంత పౌరులపై ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.  BH-series: కొత్త వాహన రిజిస్ట్రేషన్లకు భారత్ సిరీస్.. 10 కీలక పాయింట్లు

  ఐతే దీనిపై పోలీసుల వర్షన్ మరోలా ఉంది. హైవేలను దిగ్బంధించిన రైతులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించారని.. కానీ పోలీసులను లక్ష్యంగా చేసుకొని కొందరు ఆందోళనకారులు రాళ్లలో దాడి చేశారని అధికారుు తెలిపారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల రక్తాన్ని కళ్ల చూడడం దారుణమని.. భవిష్యత్ తరాలు ఈ ఘటనను గుర్తు పెట్టుకుంటాయని మండిపడ్డారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Farmers, Farmers Protest, Haryana, New Agriculture Acts

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు