Home /News /national /

గణేష్ నిమజ్జనం.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం..

గణేష్ నిమజ్జనం.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం..

గణేశ్ నిమజ్జనం ఫైల్ ఫోటో..

గణేశ్ నిమజ్జనం ఫైల్ ఫోటో..

ప్రధానంగా లక్ష జనాభా కంటే ఎక్కువ ఉన్న టైర్-1 నగరాల్లో పీసీబీ అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించింది. థర్మాకోల్, ప్లాస్టిక్ వాడకం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.

    మరికొద్దిరోజుల్లో వాడవాడలా గణేషుడు కొలువుదీరనున్నాడు. నవరాత్రులు ప్రత్యేక పూజలు.. భక్తీ కీర్తనలతో కొలహాలం నెలకొననుంది. కరోనా వైరస్ నేపథ్యంలో గతంలో గణేష్ నవరాత్రులను జరుపుకున్నట్టుగా ఈసారి జరుపుకోవడం కష్టతరమే కావొచ్చు. ఈ పరిస్థితుల్లో గణేష్ నిమజ్జనంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గణేష్ విగ్రహాల నిమజ్జన సందర్భంగా చెరువులు, నదుల్లో వ్యర్థాలను తొలగించేందుకు విసర్జన ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. వీటిని ఆయా రాష్ట్రాల బోర్డులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. ప్రధానంగా లక్ష జనాభా కంటే ఎక్కువ ఉన్న టైర్-1 నగరాల్లో పీసీబీ అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించింది. థర్మాకోల్, ప్లాస్టిక్ వాడకం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేసింది.

    గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తాత్కాలిక కొలనులను ఏర్పాటు చేయాలి. విగ్రహాలను నిమజ్జనం చేశాక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలి. విగ్రహాలతో పాటు వచ్చే పూజా సామగ్రి, పూల వంటి వాటిని ముందుగానే తొలగించి.. కేవలం విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలి. నవరాత్రులకు సంబంధించి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. ఎకో ఫ్రెండ్లీ సామగ్రిని మాత్రమే వినియోగించేలా చూడాలి.

    విగ్రహాలను కెమికల్ రంగులతో కాకుండా సహజ రంగులతోనే అలంకరించాలి. ఎండిన ఆకులు, పూలు, బెరడులతో తయారు చేసిన రంగులను ఉపయోగించేలా చూడాలి. పీసీబీ అధికారులు కాలుష్య తీరును పరిస్థితిని పరిశీలించేందుకు నిమజ్జనానికి ముందు.. మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నీటి నాణ్యతను పరీక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Ganesh Chaturthi​, Ganesh immersion, Pollution

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు