దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీనేజర్లకు వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో CoWIN పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో పలు మార్పులు చేశారు. కోవిన్ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ తప్పనిసరి. ఇప్పటిదాకా మొబైల్ నంబర్ (Mobile Number) ద్వారా 4 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఇకమీద 6 గురికి అవకాశం కల్పించేలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ (Registration Process) లో మార్పులు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా టీకాకు సంబంధించి ఏమైన తప్పులు ఉంటే మార్పులు చేసుకొనే వెసులుబాటును కోవిన్ పోర్టల్ అందిస్తుంది.
Step 4 : ఒక మొబైల్ నంబర్ మీద ఆరుగురు చేసుకొనే అవకాశం ఉంది.
Step 5 : నంబర్ రిజిస్టర్ చేయగానే ఓటీపీ (OTP) వస్తుంది. అనంతర మీకు దగ్గరలో ఉన్న ఆస్పత్రి, స్లాట్ బుక్ చేసుకోవాలి.
Step 6 : మీకు సెక్యూరిటీ నంబర్ (Security Number) వస్తుంది. ఆ నంబర్‌ను మీరు ఎంచుకున్న ఆస్పత్రికి ఎంచుకొన్న సమయానికి వెళ్లి చూపిస్తే టీకా పొందుతారు.
బూస్టర్ డోస్‌పై..
ప్రభుత్వం ప్రస్తుతం బూస్టర్ డోస్‌ను కూడా అందించింది. 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోస్ కోసం నమోదు చేసుకోవడానికి తొమ్మిది నెలల ముందు రెండవ డోస్ టీకాను పొందిన వారికి ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అదే విధంగా ఉంటుందని తెలిపారు. వారి సెకండ్ డోస్ పూర్తయిన వారికి అర్హత ఉంటే బూస్టర్ డోస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెరుచుకొంటుంది.
దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రకటించారు. జనవరి 03, 2022 నుంచి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి కోవిన్లోరిజిస్టర్ చేసుకోవాలి. పిల్లల ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డులు లేకుంటే వారి స్టూడెంట్ ఐడి కార్డ్‌లతో కూడా రిజిస్టర్ చేసుకొనే అవకాశం అధికారులు కల్పిస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.