Home /News /national /

COWIN INDIA COVID 19 VACCINATION APP TO GO GLOBAL TODAY FULL DETAILS HERE SU

CoWin: కొవిన్ యాప్‌పై ఇతర దేశాల ఆసక్తి.. నేడు కొవిన్‌పై అంతర్జాతీయ సదస్సు.. పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cowin India COVID 19 Vaccination App to Go Global Today Full Details here su | దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూపొందించిన కొవిన్‌ యాప్‌పై.. ఇతర దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కొవిన్ యాప్‌పై అంతర్జాతీయ సదస్సు జరుగనుంది.

ఇంకా చదవండి ...
    దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూపొందించిన కొవిన్‌ యాప్‌పై.. ఇతర దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కొవిన్ యాప్‌పై అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. కొవిన్ అంతర్జాతీయ సదస్సును కేంద్ర ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో పాల్గొననున్న మోదీ.. కొవిన్‌ యాప్‌కు సంబంధించిన అనుభవాలను పంచుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌గా జరగనుంది.
    ఇందులో వివిధ దేశాలకు చెందిన ఆరోగ్య, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే సుమారు 50కిపైగా దేశాలు కొవిన్‌ యాప్‌పై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌లో డిజిటల్‌ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి.

    ఇతర దేశాలు తమ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మెరుగైన మార్గాల్లో నిర్వహించడానికి సహాయపడటానికి, ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు కెనడా, మెక్సికో, పనామా, పెరూ, అజర్‌బైజాన్, ఉక్రెయిన్, నైజీరియా, ఉగాండా దేశాలు ఇప్పటికే కొవిన్‌ యాప్‌‌ను అడాప్ట్ చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక, , వియత్నాం, ఇరాక్, డొమినికన్ రిపబ్లిక్, యూఏఈ వంటి దేశాలు కూడా తమ దేశాలలో కోవిడ్ కార్యక్రమాలను అమలు చేయడం కోసం.. కోవిన్ ప్లాట్‌ఫామ్ గురించి తెలసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.

    నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ మాట్లాడుతూ.. ‘వివిధ దేశాల్లో కొవిన్ ప్లాట్‌ఫామ్‌కు చాలా డిమాండ్ ఉంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అందించడానికి ఇండియా సిద్దంగా ఉంది. కొవిన్ యాప్‌కు సంబంధించిన ఓపెన్ సోర్స్ వర్షన్ అభివృద్ధి చేయాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. దానిని కోరే దేశాలనకు ఉచితంగా ఇవ్వాలని చెప్పారు’అని తెలిపారు.

    దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. అప్పుడే కొవిన్‌ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించడానికి, ప్లానింగ్ చేయడానికి కొవిన్ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్.. వంటి సేవలను అందిస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Covid-19, Cowin Portal, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు