Making Cow Dung Cake | దేశంలోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా విద్యార్థులకు ఆవుపేడతో పిడకలు ఎలా తయారు చేయాలో నేర్పించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
యూనివర్సిటీMaking Cow Dung Cake: దేశంలోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (Banaras Hindu University) ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా విద్యార్థులకు ఆవుపేడతో పిడకలు ఎలా తయారు చేయాలో నేర్పించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి. ప్రొఫెసర్ మిశ్రా విద్యార్థులకు పేడతో పిడకలు చేయడం నేర్పించారు. ఈ తయారీ సమయంలో మిశ్రా చుట్టూ కొంతమంది విద్యార్థులు కనిపించారు, వారు పేడతో పిడకలు తయారు చేయడం కూడా ఫోటోల్లో ఉంది. యూనివర్శిటీలోని ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్మెంట్ సెంటర్లో వర్క్‌షాప్ జరిగిందని, అక్కడ విద్యార్థులకు ఆవు పేడ పిడకల తయారీలో శిక్షణ ఇచ్చామని తర్వాత ట్వీట్ చేసింది.ఈ పేడ పిడకల (Cow Dung Cake)ను పూజకు మరియు ఆహారాన్ని తయారు చేయడానికి ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ మిశ్రా చెప్పారు.
ఆవు పేడ (Cow Dung)తో తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు.ఇది రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని, విద్యార్థులు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలకు ఆవు పేడ పిడకల తయారీలో శిక్షణ ఇస్తారని అన్నారు. అయితే, అటువంటి వర్క్‌షాప్ (Work Shop) ను నిర్వహించినందుకు విశ్వవిద్యాలయంపై నెటిజన్ల ఫైర్ అయ్యారు. విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు స్థలాలుగా ఉండాలి మరియు విద్యార్థులు ప్రత్యేక జ్ఞానాన్ని సంపాదించడానికి అక్కడికి వెళతారు అంతేకాని పిడకలను ఎలా తయారు చేయాలో నేర్చుకోవడానికి కాదని ఒక నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి శిక్షణను గ్రామాల్లోని మహిళలు చాలా సులువుగా అందజేస్తారని, ఇలాంటి పనికి ఎక్కువ జీతం ఇచ్చే ప్రొఫెసర్లు ఉండాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ అన్నారు. విద్యార్దుల సమయాన్ని పనికిరాని కార్యక్రమాలతో నింపేస్తున్నారంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్ల (Comments) రూపంలో విమర్శలు చేస్తున్నారు.
అయితే దీనిపై ప్రొఫెసర్ మిశ్రా స్పందించారు. పిడకల ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నా. వీటిని పూజా, వం ట తయారీతో పాటు హోమాల్లో ఉపయోగిస్తారని తెలిపారు. వీటి గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.