Home /News /national /

COVISHIELD IS BETTER THAN COVAXIN IN TERMS OF TRIGGERING MORE ANTIBODIES AK GH

Covishield Vs Covaxin: కోవాగ్జిన్‌ కంటే సమర్థంగా పనిచేస్తున్న కోవిషిల్డ్.. తాజా అధ్యయనంలో వెల్లడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లలో ఏది సమర్థంగా పని చేస్తుందన్న విషయంపై డాక్టర్ ఎకె సింగ్, అతని సహచర బృందం అధ్యయనం నిర్వహించింది.

కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ కాగా.. మరొకటి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్. ఈ రెండు వ్యాక్సిన్లు దేశీయంగా తయారైనవే. వీటితో పాటు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే, కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లలో ఏది సమర్థవంతంగా పనిచేస్తుందనేది చాలా మందిలో ఉన్న సందేహం. దీనిపై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. కాగా, దేశవ్యాప్తంగా తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనగా డాక్టర్లు, నర్సులు, వివిధ ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వీరిలో కొందరికి కోవాగ్జిన్ ఇవ్వగా.. మరికొందరికి కోవిషీల్డ్ ఇచ్చారు. వారందరికీ దాదాపు రెండో డోసు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఇక, ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది సమర్థంగా పని చేస్తుందన్న విషయంపై డాక్టర్ ఎకె సింగ్, అతని సహచర బృందం అధ్యయనం నిర్వహించింది.

ఇందులో భాగంగా మొత్తం 515 మంది ఆరోగ్య సిబ్బందిపై పరిశీలన జరిపారు. వారిలో 305 మంది మగవారు, 210 మంది ఆడవారు ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వీరందరిలో 95 శాతం మేరకు సీరోపాజిటివిటీ (ఎక్కువ యాంటీ బాడీలు) కనుగొన్నట్లు పరిశోధకులు చెప్పారు. అయితే, ఈ రెండు వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ కోవాగ్జిన్ కన్నా కోవిషీల్డ్ మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు తేల్చి చెప్పారు.

కోవిషీల్డ్‌లోనే ఎక్కువ యాంటీ బాడీస్ ఉత్పత్తి..
మొదటి దశ వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న వారిలో 70 శాతం యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో, మూడో దశ వ్యాక్సిన్ ట్రయల్స్ తర్వాత కోవాగ్జిన్ ఎఫీషియన్సీ రేటు 81 శాతంగా నమోదైంది. కాబట్టి, ఈ రెండు వ్యాక్సిన్లు దేనికవే ప్రత్యేకత కలిగి ఉంటాయని, రెండూ సమర్థవంగా పనిచేస్తాయని అధ్యయనం వెల్లడించింది. అయితే, యాంటీ బాడీస్ వృద్ధిలో మాత్రం కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ మెరుగ్గా పనిచేస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది. అదేవిధంగా, కోవాగ్జిన్తో పోలిస్తే సెరోపోసిటివిటీ, మీడియన్ యాంటీ-స్పైక్ యాంటీబాడీ రేటు కోవిషీల్డ్‌లో గణనీయంగా నమోదైందని అధ్యయనంలో తేలింది. ఈ రెండు టీకాలు తీసుకున్న వారిలో ఎవరికీ తీవ్రమైన లేదా దుష్ప్రభావాలు కన్పించలేదు.
First published:

Tags: Covaxin, Covishield

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు