• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVISHIELD AND COVAXIN PRODUCE FEWER ANTIBODIES AGAINST B1617 BUT POTENT AGAINST OTHER VARIANTS HERE IS THE FULL DETAILS NK

Covid vaccines: చేదువార్త... ఇండియన్ వేరియంట్‌పై ప్రభావం చూపలేకపోతున్న వ్యాక్సిన్లు

Covid vaccines: చేదువార్త... ఇండియన్ వేరియంట్‌పై ప్రభావం చూపలేకపోతున్న వ్యాక్సిన్లు

జూన్‌లో దాదాపు 12 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Covid vaccines: ఇప్పటివరకూ దేశంలో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇండియన్ వేరియంట్‌ని అడ్డుకోలేకపోతున్నాయి. B.1.617 డబుల్ మ్యూటెంట్ అంత ప్రమాదకరంగా ఉందా?

  • Share this:
    Covid vaccines: ఏదైతే జరగకూడదని మనం అందరం కోరుకున్నామో అదే జరుగుతోంది. మనకు తెలుసు... ఇండియాలో B.1.617 అనే రూపాంతర కరోనా స్ట్రెయిన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది అని. దీన్నే మనం సింపుల్‌గా ఇండియన్ వేరియంట్ అంటున్నాం. కొందరేమో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ అంటున్నారు... ఎలా పిలిస్తేనేం... ప్రాణాలు తీస్తోంది ఇదే. మరి ఇప్పుడు మనకు వేస్తున్న కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ని అడ్డుకోగలుగుతున్నాయా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంది. దానికి ఇప్పుడు సమాధానం వచ్చింది. ఈ వ్యాక్సిన్లు ఈ ప్రమాదకర వేరియంట్‌ని అంతగా అడ్డుకోలేకపోతున్నాయని తేలింది. గతేడాది ఉన్న కరోనాను ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి. బాగా ఇమ్యూనిటీ శక్తిని పెంచుతున్నాయి. కానీ ఇప్పుడున్న డబుల్ మ్యూటెంట్‌ విషయంలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని తేలింది. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ప్రారంభ రిపోర్టుల ప్రకారం... B.1.617 వేరియంట్‌ని ఎదుర్కోవడానికి ఎంత ఎక్కువ యాంటీబాడీస్ ఉత్పత్తి చెయ్యాలో.. అంతలో సగం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని ఈ రెండు వ్యాక్సిన్లు. మహారాష్ట్రలో తొలిసారి ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఈ మొండిఘటం దేశ ప్రజల్ని వదలట్లేదు. చాలా రాష్ట్రాల్లో వ్యాపించింది. ఐతే... ఇది చేదు వార్తే అయినప్పటికీ... కరోనాకు సంబంధించి ఈ వ్యాక్సిన్లు వేసుకోవడం మంచి పోరాటమే అంటున్నారు చాలా మంది సైంటిస్టులు.

    జనవరి నుంచి... ICMR, పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి చెందిన శాస్త్రవేత్తలు... కరోనా పాజిటివ్ పేషెంట్ల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాటిలో బ్రిటన్ వేరియంట్ B.1.1.7 ఉంది. అలాగే... దక్షిణాఫ్రికా వేరియంట్ B.1.351 ఉంది. అలాగే P2 అనే బ్రెజిల్ వేరియంట్ ఉంది. అలాగే B.1.617 కూడా ఉంది. మిగతా వేరియంట్లపై ఈ 2 వ్యాక్సిన్లూ బాగానే పనిచేస్తున్నాయట. కానీ B.1.617 విషయంలోనే అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి అంటున్నారు. కానీ ఇండియాలో ఎక్కువ కేసులు పెరగడానికీ, సెకండ్ వేవ్ ఉద్ధృతికీ ఈ వైరస్సే కారణం అంటున్నారు.

    గతేడాది ఏప్రిల్‌లో B.1 అనే వేరియంట్ ఇండియాలో బాగా వ్యాపించింది. దాని బ్లూ ప్రింట్ రెడీ చేశారు. అప్పుడు ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఈ వైరస్‌లోని కొన్ని రూపాంతరాలు (mutations)... మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తప్పించుకొని మరీ వెళ్లగలుగుతున్నాయని తేలింది. అంటే మన యాంటీబాడీలు దీన్ని సరిగా అడ్డుకోలేకపోతున్నాయన్నమాట. ఇలాంటి వేరియంట్లపై ప్రపంచవ్యాప్తంగా ల్యాబుల్లో టెస్టులు జరుగుతున్నాయి.

    NIV శాస్త్రవేత్తలు... కోవాగ్జిన్ 2 డోసులు వేయించుకున్న వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలను B.1.617 వేరియంట్‌పై ప్రయోగించి చూశారు. గతేడాది B.1కి ఎన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయో... ఇప్పుడు అంతకంటే 55 శాతం తక్కువగా ఉత్పత్తి అయ్యాయని తేలింది. కోవిషీల్డ్ విషయానికి వస్తే... B.1 వేరియంట్‌పై ఆ వ్యాక్సిన్ 42.92 శాతం యాంటీబాడీలను ఉత్పత్తి చెయ్యగా... B.1.617 విషయంలో జస్ట్
    21.9 శాతం యాంటీబాడీలను మాత్రమే ఉత్పత్తి చేసింది.

    ఇక B.1.1.7 బ్రిటన్ వేరియంట్ విషయంలో 6 శాతం మాత్రమే తక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయట. అలాగే బ్రెజిల్ వేరియంట్ P2 విషయంలో 1 శాతం మాత్రమే తక్కువగా ఉత్పత్తి అయ్యాయట.

    మొత్తంగా ఏం తేల్చారంటే... B.1.617 విషయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండూ ఒకే రకంగా పనిచేస్తున్నాయని ICMR ఢిల్లీలోని ఎపిడెమియోలజీ డివిజన్‌కి హెడ్ గా ఉన్న డాక్టర్ సమీరన్ పాండా తెలిపారు. వారు ఈ పరిశోధనా పేపర్ తయారుచేసినవారిలో కో ఆథర్‌ (co-author)గా ఉన్నారు.

    ఇది కూడా చదవండి: Covid Vaccine: మీ ఏరియాలో వ్యాక్సిన్ ఎక్కడ లభిస్తుందో తెలుసా... ఇలా చెయ్యండి

    B.1.617 డబుల్ మ్యూటెంట్ విషయంలో యాంటీబాడీల ఉత్పత్తి సగానికి తగ్గిపోయినా... అదేమీ ఆందోళన చెందాల్సిన అంశం కాదు అంటున్నారు కొందరు సైంటిస్టులు. పది రెట్లు తగ్గిపోతే అప్పుడు టెన్షన్ పడాలి అంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: