హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid Vaccination: దేశమంటే మట్టి కాదోయ్... ప్రధాని నోట తెలుగు పాట

Covid Vaccination: దేశమంటే మట్టి కాదోయ్... ప్రధాని నోట తెలుగు పాట

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా వైరస్ రోజురోజుకూ స్పీడ్ పెంచి మరీ వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా దేశంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మెడికల్ ఆక్సిజన్ సప్లయ్ గురించి ఆరా తీశారు. ఆక్సిజన్ లభ్యతపై సమీక్ష నిర్వహించారు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కరోనా వైరస్ రోజురోజుకూ స్పీడ్ పెంచి మరీ వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా దేశంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు 2 లక్షలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మెడికల్ ఆక్సిజన్ సప్లయ్ గురించి ఆరా తీశారు. ఆక్సిజన్ లభ్యతపై సమీక్ష నిర్వహించారు.

Coronavirus Vaccination: కరోనా వైరస్‌కి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా... ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Coronavirus Vaccination: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. తెలుగులో మాట్లాడిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగువారిని అవి బాగా ఆకర్షించాయి. తన ప్రసంగంలో భాగంగా ప్రధానమంత్రి... ఈ కష్టకాలంలో మనం అందరం... అందరికీ అండగా, తోడుగా నిలవాలని అన్నారు ఈ సందర్భంగా... "సొంత లాభం కొంత మానుకొని... తోడివాడికి సాయపడవోయ్. దేశమంటే మట్టి కాదు... దేశమంటే మనుషులోయ్" అన్న గురజాడ అప్పారావు వారి పాటను గుర్తు చేశారు. తద్వారా దేశ ప్రజలంతా కలిసి ముందుకు సాగాలని సూచించారు.


ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తక్కువ సమయంలోనే 2 వ్యాక్సిన్లు వచ్చాయన్న ఆయన... శాస్త్రవేత్తలు పండుగలు జరుపుకోలేదని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మరిన్ని వ్యాక్సిన్లు తయారవుతున్నాయన్న ఆయన... ముందుగా డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది... ఆ తర్వాత సఫాయీ కర్మచారీ వారికి వ్యాక్సిన్లు వేస్తామన్నారు. తర్వాత సైనికులకు మిగిలిన వ్యాక్సిన్లు వేస్తామన్నారు. తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేస్తున్నామన్న ప్రధాని... వ్యాక్సిన్ వేసేందుకు కోవిన్ పోర్టల్ రూపొందించినట్లు తెలిపారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ నిర్భరంతో మనం కరోనాతో పోరాడుతున్నామన్న ప్రధాని మోదీ... మన కాన్ఫిడెన్స్‌ని కరోనా దెబ్బతీయలేదని అన్నారు.

అంతకుముందు దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... 10.30కి వర్చువల్‌ విధానంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ICDS సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్‌ ఏర్పాటు చేసింది. 1075 నంబర్‌తో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Weight Loss: బరువు తగ్గేందుకు 15 చిట్కాలు... పాటిస్తే చాలు.. చక్కటి ఫలితం

చైతన్యం తెచ్చిన తెలుగు పాట:

దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా... వట్టి మాటలు కట్టిపెట్టోయ్... గట్టి మేల్ తలపెట్టవోయ్... 1910లో గురజాడ అప్పారావు వారు సిన ఈ పాటను మొదటిసారిగా 1913 ఆగస్టు 9వ తేదీన ‘కృష్ణా పత్రిక’లో ప్రచురించారు. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి పాడారు. సుస్వర సునాదవినోది ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు మొదట ఈ పాటను స్వరపరిచారు. ఈ పాట ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధి పొందింది.

First published:

Tags: Coronavirus, Covid-19, Covishield, Narendra modi

ఉత్తమ కథలు