coronavirus updates: దేశంలోకి కరోనా వచ్చాక... ప్రతీదీ ఇంట్లోనే తయారుచేసుకోవడం ప్రజలకు అలవాటైంది. మాస్కులు, శానిటైజర్లను చాలా మంది సొంతంగా తయారుచేసుకున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ కూడా ఇంట్లోనే తయారుచేసుకోవాలని అనుకుంటున్నారు. ఐతే... అది అంత ఈజీ కాదు కదా... అందువల్ల వ్యాక్సిన్ ఎలా తయారుచేసుకోవాలి అని గూగుల్ ట్రెండ్స్‌లో వెతుకుతున్నారు. ఇండియాలో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలవ్వగానే... గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ టాపిక్‌గా ఇది మారిపోయింది. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు తయారుచేస్తున్న వ్యాక్సిన్లు వేసుకుంటే... సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భావిస్తున్న భారతీయులు... సొంతంగానే వ్యాక్సిన్ తయారు చేసుకుంటే దానిపై ఎక్కువ నమ్మకం ఉంటుందని భావిస్తున్నట్లు తెలిసింది.
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ప్రస్తుతం ఎక్కువ మంది 'How to make COVID vaccine at home' అని సెర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ మంది 'How to make COVID vaccine' అని సెర్చ్ చేస్తున్నారు. సమస్యేంటంటే... ఇండియాలో తయారవుతున్న వ్యాక్సిన్లను ఒకే సమయంలో ఇటు భారతీయులకూ, అటు ప్రపంచ దేశాలకూ పంపిణీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేపాల్ సహా చాలా దేశాలు వ్యాక్సిన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ఇండియాను బతిమలాడుతున్నాయి. ఇందుకు బలమైన కారణం ఉంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ప్రపంచ నెంబర్ వన్ ఇండియానే. ప్రపంచంలోని చాలా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తన్నది ఇండియానే. అందువల్ల ఇండియాలో ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లు మంచివనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఉంది. అందువల్లే అవి వ్యాక్సిన్ తమకు కావాలని వేడుకుంటున్నాయి. అందుకే కేంద్రం కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా పేషెంట్లను కాపాడే ఉద్దేశంతో... విదేశాలకు వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది.

ఇంట్లోనే కరోనా వ్యాక్సిన్ తయారుచేసుకోవడం ఎలా? (image courtesy - google trends)
ఇండియాలో ఎలాగూ కరోనా కేసులు, మరణాలూ బాగా తగ్గుతున్నాయి. అందువల్ల ఇండియన్స్ కరోనా వ్యాక్సిన్ కోసం ఇదివరకటిలా మరీ ఆసక్తిగా చూడట్లేదు. పైగా నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న 23 మంది చనిపోవడంతో... భారతీయుల్లో వ్యాక్సిన్ పట్ల ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే అసలు వ్యాక్సిన్లలో ఏముంటుంది? వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఎందుకు వస్తున్నాయి అనే అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ క్రమంలో వ్యాక్సిన్ తయారీ ఎలా అని సెర్చ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారికి గజిబిజి, కోపం ఎక్కువ... మీ రాశి ఏది?
నిజానికి ఇంట్లో వ్యాక్సిన్ తయారుచేసుకోవడం ప్రమాదకరం. వ్యాక్సిన్ల తయారీలో ఎన్నో దశలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు చేసుకొని వాడితే ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల అలాంటివి చేసుకోవద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కేంద్ర ప్రభుత్వం ముందుగా వ్యాక్సిన్‌ను హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 50 ఏళ్లు దాటిన వారికి ఇస్తోంది. తర్వాత సైనికులు, పోలీసులకు ఇవ్వనుంది. ఆ తర్వాత కరోనా పేషెంట్లు, విద్యార్థులు, ప్రజలకు ఇవ్వనుంది. ఇదంతా పూర్తయ్యేటప్పటికి కనీసం 6 నెలలు పట్టొచ్చంటున్నారు. అంతకాలం ఆగడం కష్టమని భావిస్తున్న ప్రజలు ఇలా గూగుల్‌లో సెర్చ్ చేసి విషయం తెలుసుకుంటున్నారు.
Published by:Krishna Kumar N
First published:January 19, 2021, 06:33 IST