Covid19: కరోనా పాజిటివ్‌లకు ఇకపై ఆ టెస్టు కూడా... కేంద్రం కొత్త కండీషన్. కొంత ఇబ్బందే

కరోనా పాజిటివ్‌లకు ఇకపై ఆ టెస్టు కూడా (ప్రతీకాత్మక చిత్రం)

Covid19: కరోనా కేసులకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అది పాజిటివ్ పేషెంట్లకు కొంత ఇబ్బంది కలిగించేదే అయినప్పటికీ... పరిస్థితుల కారణంగా నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ... ఇకపై కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ క్షయ (Tuberculosis (TB)) స్క్రీనింగ్ కూడా జరపాలని ప్రతిపాదించింది. అలాగే... టీబీ ఉన్న అందరికీ కరోనా టెస్టులు చెయ్యాలని ప్రతిపాదించింది. దీనికి బలమైన కారణం ఉంది. ఇండియాలో టీబీ కేసులు సడెన్‌గా పెరిగినట్లు కొన్ని మీడియాల్లో వార్తలొచ్చాయి. దాంతో ఎందుకైనా మంచిదని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈమధ్య కరోనా పాజిటివ్ అయిన వారికి... ఆ తర్వాత కరోనా నుంచి బయటపడినా క్షయ వ్యాధి సోకుతోంది. ఇది డాక్టర్లకు ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా, టీబీలపై పూర్తి నిఘా పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆగస్ట్ నాటికి ఈ అంశంపై పూర్తి క్లారిటీతో ఉండాలని కోరింది. దీంతోపాటూ... కొన్ని సలహాలతో కూడిన గైడ్‌లైన్స్ కూడా జారీ చేసింది. వాటి అర్థం ఏంటంటే... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు... ఒకేసారి వెంటవెంటనే అటు టీబీ, ఇటు కరోనా టెస్టులు చేసేయాలి. టీబీతో వచ్చేవారికి కరోనా, కరోనాతో వచ్చేవారికి టీబీ టెస్టులు చేసేయాలి. తద్వారా ఈ రెండు వ్యాధులపై మరింత స్పష్టత వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది.

    2020లో కొన్ని ప్రత్యేక చర్యలు, అవగాహనా కార్యక్రమాల వల్ల ఇండియాలో టీబీ కేసులు 25 శాతం తగ్గాయి. ఇప్పుడు మళ్లీ పెరిగాయని వార్తలు వస్తున్నా... కచ్చితంగా పెరిగాయి అనేందుకు ఆధారాలు లేవు. కాకపోతే... కరోనా, టీబీ ఈ రెండూ కూడా... ఊపిరి తిత్తులపై దాడి చేసేవే. రెండింటిలోనూ జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అందువల్ల కోవిడ్ వచ్చిన వారికి క్షయ రావడం అనేది సహజంగానే జరిగే ప్రమాదం ఉంది. అలాగే... క్షయతో బాధపడేవారికి కోవిడ్ సోకే అవకాశాలు ఎక్కువ. ఈ రెండు వ్యాధుల్లో ఏది వచ్చినా... శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఒకటి వచ్చిన వారికి రెండోది సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు.


    ఇది కూడా చదవండి: Indian Oil Money Offer: ఇందులో పాల్గొనండి... రూ.2 కోట్లు గెలుచుకోండి... వివరాలు

    సాధారణంగా చాలా మందిలో టీబీ బాసిల్లీ (TB bacilli) అనే సూక్ష్మక్రిమి ఉంటుంది. అది జీవచ్చవంలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో... ఆప్పుడు ఆ క్రిములు జోరందుకొని... వాటి సంఖ్యను పెంచుకొని... దాడిచేస్తాయి. ఒక్కసారి టీబీ వస్తే... అది తగ్గడానికి సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూగా 2 వారాలపాటూ దగ్గు వస్తే... అది టీబీ కావచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రతిపాదించినట్లు కోవిడ్, టీబీ రెండు టెస్టులూ చెయ్యాల్సిన బాధ్యత రాష్ట్రాలదే.
    Published by:Krishna Kumar N
    First published: