• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVID VACCINE YOUNG PEOPLE FEAR TO GET CORONAVIRUS VACCINATION AT DOCTORS WATCH THIS FUNNY VIRAL VIDEO NK

Covid vaccine: వామ్మో... యువతకి వ్యాక్సిన్ వేయడం మా వల్ల కాదు... డాక్టర్లకు చుక్కలు

Covid vaccine: వామ్మో... యువతకి వ్యాక్సిన్ వేయడం మా వల్ల కాదు... డాక్టర్లకు చుక్కలు

యువతకి వ్యాక్సిన్ వేయడం మా వల్ల కాదు... డాక్టర్లకు చుక్కలు (image credit - twitter)

Covid vaccine: చిన్నప్పుడు స్కూళ్లలో విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేస్తారు. అప్పుడు ఒకటే ఏడుపులు ఉంటాయి. ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ వేస్తుంటే... ఇప్పుడు కూడా యువత అలాగే నానా యాగీ చేస్తున్నారా? ఈ వీడియో చూడండి.

  • Share this:
    Covid vaccine: వ్యాక్సిన్ లేకపోతే ఓ సమస్య... ఉంటే మరో సమస్య అవుతోంది. మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన యువత వ్యాక్సిన్ వేయించుకోవచ్చని కేంద్రం చెప్పింది కదా... దాంతో చాలా మంది యువతీ యువకులు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆరోగ్య కేంద్రాలకు, కోవిడ్ సెంటర్లకూ వెళ్తున్నారు. కానీ... వ్యాక్సిన్ వేసే ముందు అసలు గోల మొదలవుతోంది. కుర్చీలో కూర్చోమంటే కూర్చోరు... కూర్చున్నా... వామ్మో సూది... వద్దు బాబోయ్ వద్దు అని గోల. "ఏం కాదు... ఏం కాదు వెంటనే అయిపోతుంది" అని డాక్టర్లు, నర్సులూ చెబుతున్నా... వద్దు బాబోయ్ అని ఏడుపులు. కుర్చీలో కూర్చున్నట్లే కూర్చొని లేచిపోతున్నారు. సరిగ్గా వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు మెలికలు తిరుగుతున్నారు. వాళ్లను కుదురుగా కూర్చోపెట్టేసరికి అనేది డాక్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.

    వ్యాక్సిన్ వేసేటప్పుడు ఇష్టమొచ్చినట్లు కదలకూడదు. అలా కదిలితే... ఇంజెక్షన్ నరాల్లోకి వెళ్లదు. అక్కడ తేడా వస్తే సైడ్ ఎఫెక్టులు వస్తాయి. కాబ్టటి... కుదురుగా కూర్చొని... వేయించుకోవాలి. అంతగా భయం ఉంటే... మరోవైపు తిరిగి చూస్తూ ఉండాలి. అంతేకానీ... ఈ వీడియోలో అమ్మాయిలా చేస్తే మాత్రం డాక్టర్లకు నరకం కనిపించడం ఖాయం.

    ఇందులో ఈ అమ్మాయి డాక్టర్ రాగానే... ఓ నిమిషం ఆగండి అంది. ఈ నాటకాలు నా దగ్గర కుదరవ్ అనుకుంటూ నర్స్ వ్యాక్సిన్ వేసేస్తుంటే... ఈ అమ్మాయి మమ్మీ మమ్మీ అని అరవడం మొదలుపెట్టింది. కానీ ఆమె తల్లి వ్యాక్సిన్ వేసేయమని ఆర్డర్ ఇచ్చింది. దాంతో ఈ అమ్మాయి... మమ్మీ ఏదైనా మాట్లాడు అని అంటుంటే... నర్స్... సైలెంట్... అని గద్దించి... వ్యాక్సిన్ వేసేసింది. ఈ వీడియో మీరూ చూడండి.


    వ్యాక్సిన్ వేయించుకోవాలా, వద్దా అనేది ఎవరి ఇష్టం వారిదే. ఇందులో బలవంతం ఏమీ లేదు. కానీ... వేయించుకుంటే కరోనా నుంచి కొంతైనా రక్షణ పొందవచ్చు. అందుకే అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు. అందువల్ల ఎవరైనా వేయించుకోవడానికి కేంద్రానికి వస్తే... డాక్టర్లు వదలకుండా వేస్తారు. అంతేగానీ మెలికలు తిరుగుతున్నారు కదా అని వదిలేయరు. కచ్చితంగా వేసి తీరతారు. కాకపోతే... అలా వెయ్యడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. 2 సెకండ్లలో వేసే వ్యాక్సిన్ కోసం... కొంత మందిని 5 నిమిషాలపాటూ కన్వీన్స్ చెయ్యాల్సి వస్తోంది.





    ఇది కూడా చదవండి: Mystery deaths: వామ్మో... 5 రోజుల్లో 22 మరణాలు.. ఆ ఊర్లో ఏం జరుగుతోంది?

    ఈ వీడియో చూసిన నెటిజన్లు సరిదా కామెంట్లు పెడుతున్నారు. యువత, ఉడుకురక్తం, ధైర్య వంతులు అంటారు కదా... మరి ఇదేంటి అని సెటైర్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలా ఎంతో మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నారు. మరి వాళ్లందరికీ సూది గుచ్చాలంటే... డాక్టర్లు, నర్సులకు చుక్కలే.
    Published by:Krishna Kumar N
    First published: