COVID VACCINE THE FIRST DAY WAS A GOOD RESPONSE TO THE COVID VACCINATION PROCESS 41 LAKH TEENAGERS WERE VACCINATED EVK
Covid Vaccine: జోరుగా టీకా.. ఫస్ట్‌డే సూపర్.. ఎంత మంది టీనేజర్లు టీకా వేయించుకొన్నారో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Covid 19 Vaccine | దేశ వ్యాప్తంగా జనవరి 3, 2022 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు ప్రభుత్వం టీకా అందిస్తోంది. జనవరి 1, 2022న ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌లో భారీగా 51 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఒక్క రోజే 41 లక్షల మంది ఫస్ట్ డోస్ వేసుకొన్నట్టు కేంద్ర వైద్యశాఖ తెలిపింది.
దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి 03, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. 15 నుంచి18 ఏళ్ల వారి కోసం జనవరి ఒకటో తేదీ నుంచి కోవిన్ పోర్టల్ (Cowin Portal) రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి 51 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సగటున రోజుకు మూడు లక్షల మంది పేర్లను నమోదు చేయించుకున్నట్లయింది. అంతే కాకుండా తొలి రోజు రికార్డు స్థాయిలో టీనేజర్లు టీకాలు వేయించుకొన్నారు. దేశ వ్యాప్తంగా అధికారిక ప్రాథమిక గణాంకాల ప్రకారం తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు (First Dose) టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్ వేదికగా తెలపింది.
146 కోట్ల మందికి టీకా..
దేశంలో ఈ గ్రూపు బాలబాలికలు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘మహమ్మారి నుంచి యువతరాన్ని కాపాడేందుకు దేశం ఒక అడుగు ముందుకు వేసింది టీకా వేయించుకున్న బాలలందరికీ, వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింతమంది టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నాను’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 146.61 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లయిందని ఆరోగ్య శాఖ తెలిపింది.
Today we have taken an important step forward in protecting our youth against COVID-19. Congrats to all my young friends between the age group of 15-18 who got vaccinated. Congrats to their parents as well. I would urge more youngsters to get vaccinated in the coming days!
15-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను త్వరలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ (Vaccination Drive) లో చేర్చుతామని ప్రధాని మోదీ వాజయపేజ్ (Vajpayee) జయంతి రోజు చెప్పిన వెంటనే అధికారుల వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య సంరక్షణ మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి కోమోర్బిడిటీలు ఉన్నవారికి టీకా యొక్క మూడవ 'ముందు జాగ్రత్త' లేదా బూస్టర్ మోతాదును కూడా ప్రధాని ప్రకటించారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..
Step 4 : ఒక మొబైల్ నంబర్ మీద ముగ్గురు చేసుకొనే అవకాశం ఉంది.
Step 5 : నంబర్ రిజిస్టర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతర మీకు దగ్గరలో ఉన్న ఆస్పత్రి, స్లాట్ బుక్ చేసుకోవాలి.
Step 6 : మీకు సెక్యూరిటీ నంబర్ వస్తుంది. ఆ నంబర్‌ను మీరు ఎంచుకున్న ఆస్పత్రికి ఎంచుకొన్న సమయానికి వెళ్లి చూపిస్తే టీకా పొందుతారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.