Home /News /national /

COVID VACCINE PROTESTING FARMERS AT DELHI BORDER SAY THEY WILL NOT TAKE VACCINE TILL FARM LAWS ARE CANCELLED NK

Agri Reform Laws: కరోనా వ్యాక్సిన్‌పై రైతులు కీలక ప్రకటన.. కేంద్రానికి కొత్త సవాలు

కరోనా వ్యాక్సిన్‌పై రైతులు కీలక ప్రకటన (image courtesy - twitter)

కరోనా వ్యాక్సిన్‌పై రైతులు కీలక ప్రకటన (image courtesy - twitter)

Agriculture Reform Laws: వ్యవసాయ సంస్కరణ చట్టాల్ని వెనక్కి తీసుకోవాల్సిందే అంటున్న రైతులు... కరోనా వ్యాక్సిన్‌పై చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

    Agriculture Reform Laws: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాల్ని రద్దు చేయాల్సిందే అంటూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు చేసిన ఓ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చట్టాల్ని రద్దు చేసేవరకూ తాము కరోనా వ్యాక్సిన్ తీసుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఇలా వ్యాక్సిన్‌కీ చట్టాలకూ ముడిపెట్టడం అందర్నీ ఆలోచనలో పడేసింది. ఒకవేళ కేంద్రం గనక చట్టాల్ని వెనక్కి తీసుకోకపోతే... ఆందోళన చేస్తున్న రైతులు నిజంగానే వ్యాక్సిన్ తీసుకోరా అనే డౌట్ వస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన రెండో రోజే రైతులు ఈ ప్రకటన చేశారు. చట్టాలు రద్దయ్యేవరకూ ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలేది లేదన్న రైతులు... అందువల్ల తాము వ్యాక్సిన్ కూడా తీసుకునే పరిస్థితి ఉండదన్నారు.

    Samyukt Kisan Morcha:
    ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఇంత కఠినంగా ఆందోళన చేస్తుండటం వెనక సంయుక్త కిసాన్ మోర్చా సంఘం ఉంది. ఇది మొత్తం 40 రైతు సంఘాలకు పెద్దన్న లాంటిది. రైతు సంఘాలు చెప్పినట్లు రైతులు నడుచుకుంటున్నారు. అందువల్ల ఆందోళనలు తీవ్రం అవుతున్నాయే తప్ప ఫలితం కనిపించట్లేదు. ఎన్నిసార్లు కేంద్రంతో చర్చలు జరిగినా... చట్టాల్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ఇటు రైతులు కూడా అది తప్ప మరో ఆలోచన లేదంటున్నారు.


    కేంద్రాన్ని మరింత ఇరకాటంలో పెట్టేందుకు జనవరి 26న ఆదివారం... ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాక్టర్ పరేడ్ నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అందుకోసం ఆల్రెడీ రిహార్సల్స్ కూడా చేసుకుంటున్నారు. "మేం ప్రశాంతంగా ర్యాలీ చేస్తాం. రిపబ్లిక్ డే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకమూ కలగదు. మేం రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చెయ్యం. ప్రతి ట్రాక్టర్ ముందూ... జాతీయ జెండాను ఏర్పాటుచేస్తాం." అని రైతు సంఘం నేతలు తెలిపారు.

    తమ ఆందోళనల్లోకి రాజకీయ పార్టీలు రాకుండా రైతులు జాగ్రత్త పడుతున్నారు. అందువల్ల ఈ ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు ఉంది. అదే సమయంలో కేంద్రం తెచ్చిన చట్టాలను కూడా కొందరు సమర్థిస్తున్నారు. వ్యవసాయంలో మార్పులు రావాల్సిందే అంటున్నారు. ఎప్పుడూ నష్టాలు, అప్పులేనా... ఇలా ఎన్నాళ్లు అని ప్రశ్నిస్తున్నారు.


    ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలా మంది 50 ఏళ్లు దాటినవారే. వారికి త్వరలో వ్యాక్సిన్ వేసే వీలు ఉంటుంది. మరి వారు వేయించుకుంటారా, నిరసన తెలుపుతారా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా తక్కువగానే ఉంది కాబట్టి... వ్యాక్సిన్ కూడా వద్దని రైతులు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

    ఇది కూడా చదవండి: పచ్చ, కెంపు, రూబీ, రత్నం, వజ్రం... ఏ నెలలో పుట్టిన వారు ఏ రాయి తొడగాలి... తెలుసుకుందాం.

    రైతు సంఘాల నేతలు ఆందోళనల మధ్య కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అధిక భాగం రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నారని అన్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులతో జనవరి 19న మరోసారి చర్చలు జరుపుతామన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదన్న ఆయన... చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ కాకుండా రైతులు తమ సమస్యలేంటో ప్రభుత్వానికి చెప్పాలన్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: New Agriculture Acts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు