covaxin: వచ్చే నెల నుంచే పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ -ముందుగా వీరికే -ఇంకా అనుమతి రాలేదన్న కేంద్ర మంత్రి

పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్

Covid Vaccine for children : దేశంలో పిల్లలకు కూడా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. 2 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు అత్యవసరంగా వాడేందుకు భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాకు అనుమతి లభించిన నేపథ్యంలో నవంబర్ మూడో వారం నుంచి టీకాల పంపిణీ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది..

  • Share this:
పిల్లలకు కరోనా టీకాలు (covid vaccine for children) పంపిణీకి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. దేశవ్యాప్తంగా పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ (covid vaccine drive in india) ను నవంబర్ మూడో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ బ్రాండ్ (bharat biotech covaxin) పేరుతోనే 2 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల కోసం తీసుకొచ్చిన టీకాను అత్యవసరంగా వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల కమిటీ మంగళవారం నాడు అనుమతివ్వడం తెలిసిందే.

పిల్లల కొవాగ్జిన్ ఎమర్జెన్సీ వాడకానికి డీసీజీఐ అనుమతి లభించడంతో పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నవంబర్ మూడో వారం నుంచి పిల్లలకు టీకాల పంపిణీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముందుగా, దీర్ఘకాలిక వ్యాధులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోన్న పిల్లలకు టీకాలు అందిస్తామన్నారు. అలాగే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు కూడా తొలి కోటాలోనే టీకాలు వేస్తారు. ఈజాబితాను సిద్దం చేయడానికి మూడు వారాల సమయం పడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

భారతదేశంలో గ్రామీణ & పట్టణ ప్రాంతాల వారీగా కొవిడ్ 19 వ్యాక్సినేషన్!


డీసీజీఐ ఆమోదం తర్వాత పిల్లల కొవాగ్జిన్ టీకాను నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీజీఐ) సభ్యులు సైతం పరిశీలిస్తారని, క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి భారత్ బయోటెక్ సమర్పించిన మధ్యంతర డేటాను కూడా అడ్వైజరీ క మిటీ అధ్యయనం చేస్తుందని, అవసరమనుకుంటే సంస్థ నుంచి అదనపు సమాచారాన్ని కూడా కోరతారని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పెద్దల టీకాల కార్యక్రమానికి విఘాతం ఏర్పడకుండా నవంబర్ మూడో వారం నుంచి పిల్లలకూ టీకాల పంపిణీ మొదలవుతుందని ఆ అధికారి పేర్కొన్నారు.

చిన్నారుల కరోనా టీకాకు కేంద్రం ఆమోదం -2నుంచి18 ఏళ్ల వారు అత్యవసరమైతే Covaxin తీసుకోవచ్చు


భారత్ లో పిల్లలు వాడటానికి అనుమతి పొందిన రెండో టీకా భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్. అంతకుముందు జైదూర్ కంపెనీ రూపొందించిన ZyCoV-Dకీ అనుమతి లభించినా అది 12 సంవత్సరాల పైబడినవారిని ఉద్దేశించింది. కొవాగ్జిన్ మాత్రం 2 నుంచి 18 ఏళ్ల వయసువారంతా వాడొచ్చు. పెద్దల టీకాలాగే పిల్లలకు కూడా కొవాగ్జిన్ రెండు డోసుల్లో ఇస్తారు. మొదటి, రెండో డోసుకు మధ్య 28 రోజుల విరామం ఉంటుంది. ఇదిలా ఉంటే,

పిల్లల కొవాగ్జిన్ టీకాకు అనుమతి విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఓవైపు టీకాల పంపిణీకి రంగం సిద్ధమవుతుండగా, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ మాత్రం వ్యాక్సిన్‌‌కు డీసీజీఐ నుంచి ఇంకా పర్మిషన్ రాలేదని చెప్పారు. భారత్ బయోటెక్ పిల్లల టీకాకు ఎక్స్‌‌పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ మాత్రమే ఇచ్చిందని, డీసీజీఐ నేరుగా అనుమతివ్వలేదని, దానికొ కొంత సమయం పట్టొచ్చని మంత్రి అన్నారు.
Published by:Madhu Kota
First published: