దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గుడ్ న్యూస్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి 03 నుంచి ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్క్‌ర్లకు బూస్టర్ డోస్‌ను కూడా జనవరి 10 నుంచి అందిస్తామని మోదీ (Modi) అన్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ సంబంధించి సెకండ్ డోస్ (Second Dose) తీసుకోవాలనుకొనే వారు ఎంత కాలం వేచి చూడాలి అనే అంశంపై సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా కోవిషీల్డ్, కోవాక్సిన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వ్యాక్సిన్‌లకు సంబంధించిన ఎంత సమయంలో తీసుకోవాలి అనే అంశపై పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని, దీనిపై తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నట్లు వారు తెలిపారు.
తొమ్మిది నెలల నుంచి 12 నెలలు..
దేశ వ్యాప్తంగా ఒమొక్రాన్ వేరియంట్ వైరస్ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన పౌరులకు, వైద్యుల సలహా మేరకు కొమొర్బిడిటీలు ఉన్నవారికి కూడా ముందస్తు జాగ్రత్త మోతాదు అందుబాటులో ఉంటుందని మోదీ తెలిపారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క రెండవ డోస్ మరియు "ముందు జాగ్రత్త మోతాదు" అని పిలువబడే మూడవ డోస్ మధ్య అంతరం తొమ్మిది నుండి 12 నెలల వరకు ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
Crime News: 18 ఏళ్ల అమ్మాయి.. అంకుల్ అని పిలిచినందుకు.. ఇంత పని చేశాడు!
భారతదేశంలోని18 ఏళ్లు పైన ఉన్న వారిలో 61 శాతం కంటే ఎక్కువ మంది టీకా యొక్క రెండు మోతాదులను పొందారు. అదేవిధంగా, వయోజన జనాభాలో 90 శాతం మంది మొదటి మోతాదును పొందారు. గత 24 గంటల్లో 32,90,766 వ్యాక్సిన్ డోస్‌లను ప్రభుత్వం అందించింది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక నివేదికల ప్రకారం, గత 24 గంటల్లో 32,90,766 వ్యాక్సిన్ డోస్‌లు అందించారు.
ఇమ్యునైజేషన్ విభాగం మరియు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (National Technical Advisory Group on Immunisation) కోవిడ్ బూస్టర్ డోస్.. ముందస్తు డోస్‌లపై పరిశీలిస్తోంది. టీకాల మధ్య సమయం 9 నుంచ 12 నెలలు ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..
దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రత్యేక చర్యలు తీసుకోంటుంది. నెమ్మదిగా టీకా వేగాన్ని కలిగి ఉన్న పది రాష్ట్రాలకు బృందాలను పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్రం ఈ లిస్ట్‌లో రళ, మహారాష్ట్ర, తమిళనాడు (Tamil Nadu), బెంగాల్, మిజోరాం, కర్ణాటక (Karnataka), బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు రెండూ రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కేంద్రం బృందాలు ఐదు రోజుల పాటు సందర్శిస్తాయి. ఈ సమయంలో కేంద్ర బృందం పలు అంశాలను పరిశీలిస్తుంది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షలు (Covid Tests), నిఘాను మెరుగుపరచడం, కోవిడ్-తగిన ప్రవర్తనను అమలు చేయడంపై రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పని చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, COVID-19 vaccine, Omicron, Pm modi, PM Narendra Modi