• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVID VACCINE CENTRE ISSUES FRESH ORDERS TO MAKE VACCINE DOSES FROM SERUM INSTITUTE OF INDIA AND BHARAT BIOTECH NK

Covid vaccine: వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం... సీరం, భారత్ బయోటెక్‌కి ఆదేశాలు

Covid vaccine: వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం... సీరం, భారత్ బయోటెక్‌కి ఆదేశాలు

Covid vaccine: వ్యాక్సిన్లపై కేంద్రం కీలక నిర్ణయం... సీరం, భారత్ బయోటెక్‌కి ఆదేశాలు (image credit - twitter)

Covid vaccine: దేశంలోని 27 రాష్ట్రాలు... లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రకటించిన వేళ... డైలీ కేసులు 4 లక్షలు వస్తున్న సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫలిస్తుందా? కరోనాకి బ్రేక్ పడుతుందా?

  • Share this:
    Covid vaccine: భారత్‌లోకి విదేశీ వ్యాక్సిన్లు వచ్చేందుకు మరింత ఎక్కువ టైమ్ పట్టేలా ఉండటంతో... కేంద్ర ప్రభుత్వం పుణెలోని సీరం ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII), హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీలకు వ్యాక్సిన్ల కోసం తాజా ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం సీరం... కోవిషీల్డ్ (covishield) వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంటే... భారత్ బయోటెక్... కోవాగ్జిన్ (covaxin) ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీని పెంచేందుకు తాజాగా మరిన్ని డోసుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు కేంద్ర పట్టణ హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటివరకూ 18 కోట్ల వ్యాక్సిన్లు వేశామన్న ఆయన... మే, జూన్, జులైకి సంబంధించి ఆర్డర్ వేసినట్లు తెలిపారు.



    మరో రెండు ట్వీట్లలో... ఏ వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ వేశారో... ఎక్కడి నుంచి వాటిని తెప్పిస్తున్నారో పురి తెలిపారు. పీఎం కేర్స్ నిధుల ద్వారా... రూ.1,176 కోట్ల విలువైన 5.6 కోట్ల వ్యాక్సిన్ల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన వివరించారు. తాజాగా మే 10న... రూ.1,575 కోట్ల విలువైన మరో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం... కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు.





    మరో ట్వీట్‌లో కేంద్రం పీఎం కేర్ నిధులను వాడి... రూ.216.83 కోట్ల విలువైన కోటి వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు పురి తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఏప్రిల్ 22న రూ.866 కోట్లతో 5 కోట్ల వ్యాక్సిన్లు, మే 10న రూ.315 కోట్లతో 2 కోట్ల వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ రెండు ఆర్డర్లూ భారత్ బయోటెక్‌కి ఇచ్చినట్లు చెప్పారు.



    ఇది కూడా చదవండి: Horoscope 12-5-2021: ఈ రాశుల వారికి సొంత నిర్ణయాలు కలిసొస్తాయి

    ప్రస్తుతం దేశంలో రోజూ 25 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సిన్ల కోసం ఎదురుచూస్తున్నాయి. కేంద్రం చెప్పినట్లు 18 ఏళ్లు దాటిన వాళ్లకి వ్యాక్సిన్ వేద్దామన్నా స్టాక్ లేదు. కనీసం 45 ఏళ్లు దాటిన వారికి మొదటి డోస్ వెయ్యడానికి కూడా లేవు. ఉన్న కొన్ని వ్యాక్సిన్లనూ రెండో డోస్ వారికి వేస్తూ సర్దుతున్నాయి రాష్ట్రాలు. మరి ఈ కొత్త ఆర్డర్లు కేంద్రానికి త్వరగా వస్తే... అప్పుడు కేంద్రం రాష్ట్రాలకు త్వరగా పంపగలదు.
    Published by:Krishna Kumar N
    First published: