COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై రెడీగా ఉండండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

COVID Vaccine: ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల ముందు రెండు సవాళ్లున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందరికీ చేరేలా చెయ్యడం. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే... ముప్పు తలెత్తకుండా కాపాడటం. దీనిపై కేంద్రం ఏం చేస్తోందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 24, 2020, 11:05 AM IST
COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై రెడీగా ఉండండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై రెడీగా ఉండండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం (ప్రతీకాత్మక చిత్రం - credit - twitter - reuters)
  • Share this:
COVID Vaccine: ఇన్నాళ్లూ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది వచ్చే టైమ్ దగ్గర పడింది. డిసెంబర్ లేదా జనవరిలోనే కోవిడ్ వ్యాక్సిన్ రావచ్చంటున్నారు. ఏ లక్ష మందికో వ్యాక్సిన్ పంపిణీ చెయ్యడం తేలిక. కానీ మన దేశంలో 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రపంచంలోనే చైనా తర్వాత ఇది అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం అవుతుంది. ఇదో భారీ సవాలు. ఇక్కడో మరో సమస్యా పొంచి ఉంది. వ్యాక్సిన్ ఇచ్చాక... సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏంటి పరిస్థితి అన్నది కూడా ముందే ఆలోచించుకోవాలి. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే... కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్ సంవత్సరాల తరబడి జరగట్లేదు కాబట్టి... వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, రావా అన్నది చెప్పలేమంటున్నారు. వచ్చే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో... జిల్లాల స్థాయి వరకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే... వెంటనే స్పందించేలా రెండీ అవ్వాలని కేంద్రం ఆదేశిస్తూ లేఖ రాసింది.

12 కండీషన్లతో లేఖ:

తన ఆదేశాలలో కేంద్రం 12 అంశాల్ని తప్పనిసరి చేసింది. రాష్ట్రాలు ముందుగానే ప్రిపేర్ అవ్వాలని వారం కిందట చెప్పింది. కొవిడ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తోందో, ఎలాంటి ప్రభావం చూపిస్తోందో... డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, వైద్య బృందాలన్నీ నిరంతరం కనిపెట్టేలా రెడీ అవ్వాలని చెప్పింది. ఎక్కడైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే... వెంటనే దేశం మొత్తం చాలా వేగంగా ఆ విషయం తెలియజేసేలా రెడీ అవ్వాలంది. ఈ అంశంపై కేంద్ర వర్గాల్లో బాగా చర్చ జరిగింది. వ్యాక్సిన్ ఇవ్వడమే కాదు... ఆ తర్వాత పరిణామాలపైనా రెడీ అవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖలో నిపుణులు సూచించారు. అందుకు తగ్గట్టుగా కేంద్రం అలర్ట్ అయ్యి... రాష్ట్రాలనూ ముందే రెడీ చేస్తోంది.

వ్యాక్సిన్ ముందుగా ఎవరికి ఇవ్వాలి... ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి, చివరిగా ఎవరికి ఇవ్వాలి... వంటి అంశాలపై ఆల్రెడీ కేంద్రం, రాష్ట్రాలు దాదాపు రెడీ అయ్యాయి. వ్యాక్సిన్ ట్రయల్స్ ఎంతవరకూ వచ్చాయో, కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతి రోజూ నివేదికలు తెప్పించుకుంటూనే ఉంది. ప్రపంచ దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్లు, సైడ్ ఎఫెక్టులపై లోతుగా అధ్యయనం చేస్తోంది. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండో దశలో ఓ వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఐతే... ప్రాణాపాయం కలగలేదు. అలాంటి అంశాలు... అప్రమత్తతను గుర్తుచేస్తున్నాయి.ఇది కూడా చదవండి: Google Task Mate: కొత్త యాప్ తెచ్చిన గూగుల్. పనులు పూర్తిచేసి డబ్బు సంపాదించుకోండి

దేశవ్యాప్తంగా 300 మెడికల్ కాలేజీలు, ఇతర స్థానిక కేర్ ఆస్పత్రులు... కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టులపై ముందుగానే సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కేంద్రం తన లేఖలో కోరింది. దేశంలోని న్యూరాలజిస్టులు, కార్డియాలజిస్టులు, శ్వాస సంబంధ వైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, పిడియాట్రీషియన్స్ అందరూ... సైడ్ ఎఫెక్టులు వస్తే... వెంటనే తగిన ట్రీట్‌మెంట్ అందించేందుకు రెడీగా ఉండాలని ఆదేశించింది. ఇందుకు తగిన టెక్నాలజీ, ఏర్పాట్లను ప్రతి రాష్ట్రం ఓ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ఉంచాలని కోరింది.

AEFI వ్యవస్థ:
సైడ్ ఎఫెక్టులను నియంత్రించే వ్యవస్థలు ఇండియాలో 1988 నుంచి ఉన్నాయి. 2005, 2010, 2015లో నేషనల్ AEFI (Adverse Events Following Immunization - వ్యాక్సిన్ తర్వాత జరిగే విపరీత పరిణామాలు) గైడ్‌లైన్స్ జారీ అయ్యాయి. కరోనా సందర్భంగా... గైడ్‌లైన్‌లో చాలా మార్పులు చేశారు. ప్రధానంగా అన్ని రాష్ట్రాలూ సరిపడా అడ్రినలిన్ ఇంజెక్షన్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా కరోనా వ్యాక్సిన్ ప్రాణాలపైకి తెస్తే... వెంటనే ఆ ఇంజెక్షన్లను ఇచ్చేలా... ఆస్పత్రి స్టాఫ్‌కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అనాఫిలాక్సిక్ కిట్స్ (Anaphylaxis kits) కూడా రెడీగా ఉంచుకోవాలి. ఎవరికైనా వ్యాక్సిన్ వల్ల అలర్జీల వంటివి వస్తే... ఈ కిట్ ఉపయోగపడుతుంది.ఇది కూడా చదవండి: Princess Haya Affair: బాడీగార్డుతో దుబాయ్ రాజు ఆరో భార్య ఎఫైర్. రూ.12 కోట్లు ఇచ్చి...

వ్యాక్సిన్ ఏం చేస్తుంది:
బాడీలోకి వ్యాక్సిన్ ఇచ్చాక... అది మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాండీ బాడీస్ సంఖ్య పెరిగేలా చేస్తుంది. అత్యంత కీలకమైన కీటోన్స్ పెరిగేలా చేస్తుంది. ఏ వైరస్‌తోనైనా ఇవి పోరాడుతాయి. కరోనా వైరస్‌ తోనూ ఇవి పోరాడుతాయి. అందువల్ల వ్యాక్సిన్ పొందిన వారిలో యాంటీబాడీస్ పెరిగి... వైరస్ రాకుండా అవి అడ్డుకోవడానికి వీలవుతుంది. అందుకే అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రపంచ దేశాలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియా కూడా అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది.
Published by: Krishna Kumar N
First published: November 24, 2020, 11:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading