హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid Vaccine: జూలై నాటికి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్. కోవిషీల్డ్‌పై అదార్ పూనవల్లా స్పష్టం

Covid Vaccine: జూలై నాటికి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్. కోవిషీల్డ్‌పై అదార్ పూనవల్లా స్పష్టం

అదర్ పూనావాలా

అదర్ పూనావాలా

Adar Poonawalla: ప్రపంచ దేశాలన్నీ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కంపెనీ సృష్టించిన కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ కోసం చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కీలక విషయాలు చెప్పింది.

Covishield vaccine: ఆక్స్‌ఫర్డ్ (Oxford) యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా (AstraZeneca) ఫార్మా కంపెనీ కలిసి అభివృద్ధి చేసిన Covid-19 వ్యాక్సిన్ (Covishield) ఎమర్జెన్సీ వాడకానికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి జనవరిలో అనుమతులు లభించవచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అదార్ పూనవల్లా (Adar Poonawalla) చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఇండియాలో ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకం కోసం 4 కోట్ల నుంచి 5 కోట్ల డోసులను సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. జులై నాటికి ప్రపంచ దేశాలకు కనీసం 30 కోట్ల డోసులు అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు. కోవిషీల్డ్ వాడకానికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి త్వరలోనే అనుమతులు లభిస్తాయిని ఆయన తెలిపారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ పునావాలా మాట్లాడుతూ " UK ప్రభుత్వం నుంచి త్వరలోనే కొన్ని శుభవార్తలను వింటామని భావిస్తున్నాం. జనవరి నాటికి, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదాలు కూడా లభిస్తాయి. భారతదేశంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ (vaccine)ను తయారుచేస్తున్న పూణెకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఇప్పటికే 4 కోట్ల నుంచి 5 కోట్ల మోతాదులను తయారు చేసింది. ప్రస్తుతం మా దగ్గర 40-50 మిలియన్ మోతాదుల కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. జూలై 2021 నాటికి 30కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తాం." అన్నారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం:

"ప్రారంభంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను నెమ్మదిగా ఉత్పత్తి చేస్తాం. ఇది బాగా పనిచేసిన తర్వాత జనవరిలో ఉత్పత్తి వేగాన్ని పెంచుతాం.’’ అని అదార్ పూనవల్లా తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పనితీరుపై ప్రజల్లో అనేక సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిపై మాట్లాడుతూ "రెగ్యులేటర్స్ కరోనా డేటాను అంచనా వేస్తున్నాయి. చాలా మంది ప్రజలు వ్యాక్సిన్ (vaccine)పై తమ సమస్యలు చెబుతున్నారు. దీనిపై అస్సలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మేం రూపొందించిన వాక్సిన్... 92 నుంచి 95 శాతం వరకు పనిచేస్తోంది.” అని అదార్ చెప్పారు.

ఇండియాలో కొత్త కరోనా వైరస్:

భారత్‌లోకి బ్రిటన్ లోని కొత్త కరోనా (రూపాంతర - mutated) వైరస్ ఇండియాలోకీ ప్రవేశించిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన వారికి చెక్ చెయ్యగా... 6గురిలో కొత్త కరోనా ఉన్నట్లు తేలింది. వారిలో ముగ్గురికి NIMHANS, ఇద్దరికి బెంగళూరులోని CCMBలో జరిపిన పరీక్షల్లో, ఒకరికి హైదరాబాద్‌లో, ఇంకొకరికి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ (NIV)లో జరిపిన పరీక్షల్లో కొత్త కరోనా ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఈ ప్రయాణికులందర్నీ... ఎవరికి వారిని విడివిడిగా రూముల్లో ఐసోలేట్ చేశారు. వారికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి. వారితో క్లోజ్ కాంటాక్టులు ఎవరు అన్నది ఇప్పుడు చెక్ చేస్తున్నారు. కంప్లీట్ కాంట్రాక్ట్ ట్రేసింగ్ జరుగుతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందర్నీ టెస్టులు చేస్తున్నారు.

Adar Poonawalla, AstraZeneca, Oxford, uk virus, covid 19 new virus, Covishield, vaccine, Covid19, ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా, సీరం ఇన్స్టిట్యూట్, అదార్ పూనవల్లా, కోవిషీల్డ్‌, కరోనా కొత్త వైరస్,
కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన

ఇండియాలో తగ్గిన కరోనా కేసులు:

ఇండియాలో కొత్త కరోనా కేసులు కేవలం 16,432 మాత్రమే వచ్చాయి. మొత్తం కేసులు 1,02,24,303కి చేరాయి. నిన్న కొత్తగా 252 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,48,153కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.4 శాతం ఉంది. నిన్న కొత్తగా 24,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 98,07,569కి చేరింది. దేశంలో రికవరీ రేటు 95.9 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 2,68,581గా ఉన్నాయి. నిన్న దేశంలో 9,83,695 టెస్టులు చెయ్యగా... మొత్తం టెస్టుల సంఖ్య 16,98,01,749కి చేరింది.

Adar Poonawalla, AstraZeneca, Oxford, uk virus, covid 19 new virus, Covishield, vaccine, Covid19, ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా, సీరం ఇన్స్టిట్యూట్, అదార్ పూనవల్లా, కోవిషీల్డ్‌, కరోనా కొత్త వైరస్,
ఇండియాలో కరోనా కేసుల అప్ డేట్

ఇది కూడా చదవండి:Sex In 2020: సెక్స్‌ పై 8 ఆసక్తికర విషయాలు... 2020లో కనుకున్న సైంటిస్టులు

ఈ పరిస్థితుల్లో బ్రిటన్ అనుమతి ఇవ్వగానే... తాము కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

Published by:Krishna Kumar N
First published:

Tags: Coronavirus, Covid-19, UK Virus

ఉత్తమ కథలు