Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్... ఎయిమ్స్ డాక్టర్ల ప్రకటన

ఓం బిర్లా (File Image)

Lok Sabha speaker Om Birla: ఇప్పటికే కరోనా మహమ్మారి ఎంతో మంది నేతలకు సోకింది. తాజాగా ఆ లిస్టులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా చేరిపోయారు.

 • Share this:
  Coronavirus updates: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎయిమ్స్ డాక్టర్లు స్పష్టం చేశారు. మార్చి 19న ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని టెస్టుల ద్వారా తెలిసిందని డాక్టర్లు వివరించారు. మార్చి 20న ఆయన ఎయిమ్స్ లోని కొవిడ్ కేర్ సెంటర్‌లో అబ్జర్వేషన్ కోసం చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, శరీరంలోని అన్ని వ్యవస్థలూ సాధారణంగానే ఉన్నాయని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 58 సంవత్సరాలు. స్పీకర్ స్థాయిలో ఉన్న ఆయనకు కరోనా సోకడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంపీలను కూడా ఈ వైరస్ వదలట్లేదని స్పష్టమవుతోంది.

  ఇండియాలో కరోనా లాక్‌డౌన్‌కి ఏడాది పూర్తైంది. గతేడాది మార్చి 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ... 14 గంటల జనతా కర్ఫ్యూ ప్రకటించారు. ఆ తర్వాత దేశమంతా లాక్‌డౌన్లు మొదలయ్యాయి. జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియ చేపట్టారు. మళ్లీ లాక్‌డౌన్ రాదని చెబుతున్నా... పరిస్థితులు మాత్రం అలా కనిపిస్తున్నాయి.

  ఇండియాలో కొత్తగా 43,846 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. కొత్తగా 197 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,59,755 అయ్యింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 22,956 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కి చేరింది. రికవరీ రేటు 96 శాతంగా ఉంది. మన దేశంలో ప్రస్తుతం 3,09,087 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కొత్తగా 11,33,841 టెస్టులు చెయ్యగా... మొత్తం టెస్టుల సంఖ్య 23,35,65,119కి చేరింది. (image credit - NIAID)

  ఇండియాలో యాక్టివ్ కేసులు 20,693 పెరిగాయి. ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్, మేఘాలయ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హర్యానాలో యాక్టివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తక్కువగానే పెరుగుతున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published: