• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVID VACCINATION KHANDWA BJP MP NANDKUMAR SINGH CHAUHAN DIES OF COVID19 NK

Covid 19: మరో ఎంపీని మింగేసిన కరోనా... విషాదంలో బీజేపీ శ్రేణులు

Covid 19: మరో ఎంపీని మింగేసిన కరోనా... విషాదంలో బీజేపీ శ్రేణులు

నందకుమార్ సింగ్ చౌహాన్ (File Image)

Coronavirus updates: కరోనా వచ్చాక... సామాన్యులు, ప్రముఖులు అని తేడా లేదు చాలా మంది చనిపోయారు... ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఓ ఎంపీ స్థాయి నేత చనిపోవడం ఆందోళనకర అంశమే.

  • Share this:
    ఓవైపు దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తోంది. నిన్నటి నుంచి 60ఏళ్లు దాటిన వారికీ, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. అయినప్పటికీ ఓ ఎంపీని మనం కాపాడుకోలేకపోయాం. మధ్యప్రదేశ్... ఖంద్వా బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్... కరోనాతో కన్నుమూశారు. ఆమధ్య శ్వాస సంబంధిత సమస్య రావడంతో... టెస్ట్ చేయగా... కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ... చివరకు ఈ లోకాన్ని వీడిపోయారు. నందకుమార్... ఇదివరకు మధ్యప్రదేశ్ బీజేపీకి అధ్యక్షుడిగా చేశారు. ఖంద్వా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్య వహిస్తున్న నందకుమార్ మృతితో... బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. నేతలు ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

    షాకింగ్ విషయమేంటంటే... దేశంలో దాదాపు 40 రోజులకై పైగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అందువల్ల.. ఇక కరోనా మరణాలు తగ్గినట్లే అని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా పాలకులు, ఎంపీలకు కరోనా సమస్య ఉండదని అంతా అనుకుంటున్న తరుణంలో... నందకుమార్ మరణం షాకింగ్ విషయమే. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చెయ్యాల్సిన అవసరాన్ని ఈ విషయం బయటపెడుతోంది.

    ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో జోరుగా రియల్ ఎస్టేట్... 26 శాతం పెరిగిన ఇళ్ల అద్దెలు... దేశంలోనే అత్యధికం

    ఎంపీ స్థాయి వ్యక్తులే కరోనా నుంచి తప్పించుకోలేకపోతే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న వస్తుంది. ప్రస్తుతానికి దేశంలో కరోనా చాలా వరకూ తగ్గింది. మరణాలు కూడా తగ్గాయి. ఐతే... మహారాష్ట్ర, మరో 5 రాష్ట్రాలలో కరోనా కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల ప్రజా ప్రతినిధులు, పెద్ద వయసు వారందరికీ వేగంగా వ్యాక్సిన్ వేసేలా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు