Home /News /national /

India Vaccine: 13 రోజుల్లో 30 లక్షల మందికి టీకాలు... ఇండియా ప్రపంచ రికార్డు

India Vaccine: 13 రోజుల్లో 30 లక్షల మందికి టీకాలు... ఇండియా ప్రపంచ రికార్డు

13 రోజుల్లో 30 లక్షల మందికి టీకాలు... ఇండియా ప్రపంచ రికార్డు

13 రోజుల్లో 30 లక్షల మందికి టీకాలు... ఇండియా ప్రపంచ రికార్డు

Coronavirus updates: ఈ మధ్య భారతీయులు గర్వపడే చాలా ఘటనలు జరుగుతున్నాయి. వాటిలో మరొకటి చేరింది. అదే స్పీడ్ వ్యాక్సినేషన్. టీకాలు వేయడంలో ఇండియా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.

    Covid Vaccine: రేస్ ఎవరు ముందు మొదలుపెట్టారన్నది ముఖ్యం కాదు... ఎవరు వేగంగా వెళ్తున్నారన్నది ముఖ్యం. అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాలు ఇండియా కంటే ముందుగా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాయి. కానీ... వాటన్నింటి రికార్డులను బ్రేక్ చేస్తూ... ఇండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. జస్ట్ 13 రోజుల్లో... 30 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ డేటా చెబుతోంది. ఈ 30 లక్షల మార్క్ చేరుకోవడానికి అమెరికాకు 18 రోజులు పట్టగా... ఇజ్రాయెల్‌కు 33 రోజులు పట్టింది. బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది. నిజానికి ఇప్పుడు టీకా అవసరం మన కంటే ఆ దేశాలకే ఎక్కువగా ఉంది. ఇండియాలో కరోనా తక్కువగానే ఉంది కాబట్టి మనం కంగారుగా టీకాలు ఇవ్వాల్సిన పని లేదు. అయినప్పటికీ ఇండియా జోరు సాగించింది.

    ఇదెలా సాధ్యమైందంటే... ఇండియాలో ర్యాపిడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో మొదటి నుంచి రకరకాల వ్యాధులకు టీకాలు వేసే అలవాటు ఉంది. సో... గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఇండియాలో ఇలాంటి సదుపాయాలు బాగా ఉన్నాయి. దాంతో... కరోనా వైరస్‌కి కూడా 2 వ్యాక్సిన్లు రాగానే... అంతా రెడీ అయిపోయారు. వేగంగా టీకాలు వేసేస్తున్నారు. పైగా టీకాలు వేస్తున్నది కూడా హెల్త్ వర్కర్లకే కావడం వల్ల ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది.

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చాలా పద్ధతిగా, వేగంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. కర్ణాటక (2,86,089), మహారాష్ట్ర (2,20,587), రాజస్థాన్ (2,57,833), ఉత్తరప్రదేశ్ (2,94,959) సహా కొన్ని రాష్ట్రాల్లో 2 లక్షల మందికి పైగా టీకా పొందారు. రోజూ సగటున 5 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు రోజుకు 2 లక్షలే వేయగలిగారు. ఇప్పటికే ఇండియా వేగంగా 10 లక్షల వ్యాక్సిన్లు, వేగంగా 20 లక్షల వ్యాక్సిన్ల రికార్డులను సొంతం చేసుకుంది కూడా.

    ఇది కూడా చదవండి:Bitcoin: బిట్‌ కాయిన్ కొంటున్నారా... ఈ విషయం తెలిస్తే అస్సలు కొనరు

    ఫిబ్రవరి నుంచి హెల్త్ వర్కర్లతోపాటూ... ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సిన్ వేయబోతున్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాలూ రెడీ అవుతున్నాయి. అందువల్ల సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరిన్ని కొత్త రికార్డులు రావడం గ్యారెంటీ అన్నట్లు కనిపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Corona Vaccine, Coronavirus

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు