• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVID VACCINATION AIIMS SCIENTISTS ARE STUDYING IF CHANTING GAYATRI MANTRA CAN CURE COVID 19 SAYS REPORT

Covid 19: గాయంత్రి మంత్రంతో కరోనా అంతం?... పరిశోధిస్తున్న ఎయిమ్స్ శాస్త్రవేత్తలు

Covid 19: గాయంత్రి మంత్రంతో కరోనా అంతం?... పరిశోధిస్తున్న ఎయిమ్స్ శాస్త్రవేత్తలు

గాయంత్రి మంత్రంతో కరోనా అంతం? (ప్రతీకాత్మక చిత్రం)

Coronavirus updates: ఏం చేసినా కరోనా పోయేలా కనిపించట్లేదు. మరి మంత్రాలతో కరోనా పోతుందా అనే డౌట్ వచ్చిన ఎయిమ్స్ (AIIMS) శాస్త్రవేత్తలు ఆ దిశగా లోతైన పరిశోధనలు మొదలుపెట్టారు.

  • Share this:
    Coronavirus updates: కరోనాకి వ్యాక్సిన్ వచ్చినా... ఏ ప్రయోజనమూ కనిపించట్లేదు. ఎప్పట్లాగే వైరస్ వ్యాపిస్తూనే ఉంది. మరి ఎలా ఆ వైరస్‌కి చెక్ పెట్టాలి అని ఆలోచిస్తున్న రుషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - ఎయిమ్స్ (AIIMS) శాస్త్రవేత్తలు... గాయంత్రి మంత్రం పఠిస్తూ... ప్రాణయామం చేయడం ద్వారా కరోనా వైరస్ తగ్గుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తున్నట్లు తెలిసింది. ఐతే... ఇక్కడ కేవలం మంత్రం పఠించడమే కాదు... రెగ్యులర్ ట్రీట్‌మెంట్ కూడా ఇస్తూ... పఠిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో భాగమైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) చేయిస్తున్న అధ్యయనం. దీని ద్వారా ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే... రెగ్యులర్ ట్రీట్‌మెంట్ ద్వారా... ఎన్ని రోజులకు కరోనా నయం అవుతుందో... అంత కంటే తక్కువ సమయంలోనే మంత్రం, ప్రాణయామం చేయడం ద్వారా తగ్గుతుందా అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇందుకోసం ఎయిమ్స్... 20 మంది పేషెంట్లపై అధ్యయనం జరుపుతోంది.

    రిపోర్టు ప్రకారం... 20 మంది పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 10 మంది ఉన్నారు. మొదటి గ్రూపులో వారు రోజూ ఉదయం వేళ, సాయంత్రం వేళ గంట గంట చొప్పున ప్రాణాయామం చేస్తారు. అలాగే గాయత్రీ మంత్రం పఠిస్తారు. వీళ్లకు రెగ్యులర్ ట్రీట్‌మెంట్ కూడా ఉంటుంది.

    రెండో గ్రూపులో వాళ్లకు ఈ మంత్రాలు, మెడిటేషన్ల వంటివి ఉండవు. వీళ్లకు మామూలు ట్రీట్‌మెంటే ఉంటుంది. 2 గ్రూపులనూ 14 రోజులపాటూ ఉంచి... పరిశోధన చేయబోతున్నారు. వారిలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నా... జ్వరం తగ్గుతోందా అన్నది తెలుసుకుంటారు.

    మంత్రి ఈటల రాజేందర్ పుట్టిన రోజు వేడుకలు:

    14 రోజుల తర్వాత... ఫలితాలను రికార్డ్ చేస్తారు. రెండు గ్రూపుల్లో మంత్రం పఠించిన వాళ్ల ఆరోగ్యం ఏమైనా మెరుగ్గా ఉందా అన్నది చూస్తారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇచ్చేందుకు ప్రధాన పరిశోధకులు తిరస్కరించారని తెలిసింది. ఇలాంటి పరిశోధన జరగడం ఇదే తొలిసారి.

    ఇది కూడా చదవండి: Mask Fight: మాస్క్ పెట్టుకోమంటే ముష్టి యుద్ధం.. రెచ్చిపోయిన మహిళ... వైరల్ వీడియో

    2020 జూన్‌లో సూర్యగ్రహణం వచ్చింది. అది చాలా పెద్ద సూర్యగ్రహణం అనీ... అలాంటిది మళ్లీ రావాలంటే వందల సంవత్సరాలు పడుతుందని అన్నారు. దాంతో... ఆ సూర్యగ్రహణంతో కరోనా పోతుందా అని చాలా మంది అడిగారు. అలా జరగదని సైంటిస్టులు చెప్పినా చాలా మంది నమ్మలేదు. కరోనాను పోగొట్టేందుకే ఆ సూర్యగ్రహణం వస్తుందని ప్రచారం బాగా జరగడంతో... జనం అదే నమ్మారు. ఇప్పుడు కరోనాకి గాయత్రీ మంత్రంపై ఎలాంటి ప్రచారం జరుగుతుందో అనే చర్చ మొదలైంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు