• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • COVID SECOND WAVE DANGEROUS AFFECT NEWBORNS CHILDREN BETWEEN AGE 1 YEAR TO 5 YEARS AMONG THOSE AFFECTED SAYS DELHI DOCTORS NK

Corona Second Wave: పిల్లలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం.. మీ పిల్లలు జాగ్రత్త

Corona Second Wave: పిల్లలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం.. మీ పిల్లలు జాగ్రత్త

Corona Second Wave: పిల్లలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం.. మీ పిల్లలు జాగ్రత్త (image credit - twitter)

Corona Second Wave: కరోనా వైరస్ పిల్లలకు రాదు... ఏం కాదు అని ఎవరైనా అంటే... వారికి ఈ విషయం చెప్పండి. తద్వారా అప్రమత్తం చేసినట్లు అవుతుంది.

  • Share this:
    Corona Second Wave: మీ ఇంట్లో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే... మీరు ఈ స్టోరీ తప్పక చదవడం మేలు. ఎందుకంటే... కొత్తగా పుట్టిన పిల్లలు, పసి కందులు, చిన్నారులపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రమాదకరంగా (very dangerous) ప్రభావం చూపుతోందని డాక్టర్లు తెలిపారు. గతేడాది వచ్చిన కరోనాకీ, ఇప్పుడున్న కరోనాకీ చాలా తేడా ఉంది. గతేడాది కరోనా అంత వేగంగా వ్యాపించలేదు. ఇప్పటి కరోనా కొంపలు మునిగినట్లు వ్యాపిస్తోంది. ఒకటే జోరు. దేశంలో ఈమధ్య కరోనా... పసికందులు, ఐదేళ్ల లోపు పిల్లలు, యువకుల్లో ఎక్కువగా వ్యాపిస్తోందని ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రిలోని పిడియట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ధీరెన్ గుప్తా అంటున్నారు. ఆ ఆస్పత్రిలో గతేడాది కరోనాతో చేరిన పిల్లల కంటే ఈ ఏడాది 5 రెట్లు ఎక్కువగా చేరినట్లు తెలిపారు. అంటే పిల్లలకు కరోనా సోకే అవకాశం 5 రెట్లు పెరిగినట్లే.

    కొన్ని రోజుల కిందట పుట్టిన పసికందుకు కూడా కరోనా సోకిందంటే ఎంత బాధాకరమైన విషయం అది. షాక్ ఏంటంటే... అదే ఆస్పత్రిలో ఆ పసికందు పుట్టింది. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. అయినా మాయదారి మహమ్మారి సోకేసింది. "కరోనా సోకుతున్న పిల్లల్లో 30 శాతం మంది... 15 నుంచి 30 ఏళ్ల లోపు వారే" అని మరో డాక్టర్ సక్సేనా తెలిపారు.

    దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం పీల్చే గాలిలో కూడా కరోనా ఉన్నట్లే అంటున్నారు. ఇంట్లో ఉంటే కూడా మాస్క్ పెట్టుకోమంటున్నారు. ఇప్పటికీ బయట తిరిగే చాలా మంది మాస్కులు పెట్టుకోవట్లేదు. ఇక ఇళ్లలోనూ పెట్టుకోమంటే జరిగే పనేనా అనేది ఓ ప్రశ్న. అది అలా ఉంచితే... చాలా మంది మాస్క్ పెట్టుకున్నా... సగమే పెట్టుకుంటున్నారు. దాన్ని నోటి కిందకు వదిలేస్తున్నారు. అలా మాస్క్ పెట్టుకున్నా... పెట్టుకున్నట్లే కాదు. మన జుట్టులోని ఓ వెంట్రుక దూరేంత ఖాళీ ఉన్నా చాలు... ఆ కొద్ది ప్రదేశం నుంచే వెయ్యి కరోనా వైరస్‌లు మన లోపలికి వెళ్లగలవు. అలా ఓ వెయ్యి వైరస్‌లు వెళ్తే... కొన్ని గంటల్లోనే అవి లక్షల వైరస్‌లు కాగలవు. కాబట్టే... అసలు వైరస్ అనేది లోపలికి వెళ్లకుండా మనమే చూసుకోవాలి.

    పిల్లలు జాగ్రత్త:
    మాస్క్ ఎలా పెట్టుకోవాలో, ఎందుకు పెట్టుకోవాలో పెద్దవాళ్లకు తెలుస్తుంది కానీ... పిల్లలకు తెలియదు. కానీ వాళ్లు కూడా మాస్క్ పెట్టుకునేలా పెద్దవాళ్లమైన మనమే ఒకటికి నాలుగుసార్లు చెప్పి అలవాటు చెయ్యాలి. అసలే ఇప్పుడు కరోనా వస్తే బయట ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏవీ సరిగా లేవు. అన్నీ కొరతే. చివరకు అంబులెన్సులు కూడా కొరతగానే ఉన్నాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టే జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఇది కూడా చదవండి: Corona New Strain: వామ్మో కరోనా కొత్త స్ట్రెయిన్... 24 గంటల్లో ఊపిరితిత్తులు ఔట్

    India Corona latest: ఇండియాలో కొత్తగా 2,61,500 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కి చేరింది. కొత్తగా 1,501 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,77,150కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,38,423 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,28,09,643కి చేరింది. రికవరీ రేటు 86.6 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 15,66,394 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటి వరకు 26 కోట్ల 65 లక్షల 38వేల 416 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 26,84,956 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు 12 కోట్ల 26 లక్షల 22వేల 590 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు