Home /News /national /

COVID RESTRICTIONS FOR PARL BUDGET SESSION RS TO SIT IN MORNING LS IN EVENING FM NIRMALA TO PUT BUDGET ON FEB 1 SAYS BULLETIN MKS

Union Budget 2022: పార్లమెంట్ సమావేశాల బులిటెన్ విడుదల -Covid దెబ్బకు రెండు షిఫ్టుల్లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో ఈసారి కూడా పార్లమెంట్ ఉభయ సభలు షిఫ్టుల వారీగా పనిచేయనున్నాయి. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్‌ మంగళవారం నాడు బులెటిన్‌ విడుదల చేసింది. వివరాలివి..

దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా వస్తుండటం, పార్లమెంట్ సిబ్బందిలో వందల మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం, పదుల సంఖ్యలో ఎంపీలు కూడా వైరస్ బారిన పడిన నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సవాలుగా మారింది. కాగా, కరోనా నేపథ్యంలో ఈసారి కూడా పార్లమెంట్ ఉభయ సభలు షిఫ్టుల వారీగా పనిచేయనున్నాయి. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్‌ మంగళవారం నాడు బులెటిన్‌ విడుదల చేసింది. పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ తేదీలు, పని చేసే సమయాలను బులిటెన్ లో వెల్లడించారు. వివరాలివి..

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌ నాధ్‌ కోవింద్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్‌ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

IAS Cadre Rules: కేంద్రంపై విపక్ష సీఎంల గగ్గోలు -PM Modiకి సంచలన లేఖ రాసిన CM KCR



బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 11గంటలకు స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు నుంచి 11వ తేదీ వరకూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సభ నడుస్తుంది. రాజ్యసభ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ కొనసాగుతుంది.

Check Power: గ్రామ పంచాయితీల్లో ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు



పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్‌ హాల్‌లలో సీట్లు ఏర్పాటు చేశారు. ఇక మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8 వరకూ రెండో దశ సెషన్లను నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతోన్న సమయంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉండటం గమనార్హం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు పలు అస్త్రాలతో సిద్ధం కాగా, వారిని ఎదుర్కొనేందుకు సర్కారు సైతం సమాయంత్తమైంది.
Published by:Madhu Kota
First published:

Tags: Parliament, Union Budget 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు